బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విషయానికి వస్తే.. తొలుత మంచి క్రేజ్ లభించినా కూడా ఆ తర్వాత స్ట్రీమింగ్ పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అందుకు ముఖ్య కారణం ఇవ్వాళ జరిగిన విషయాలను రికార్డ్ చేసి ఎడిటి చేసి రేపు లైవ్ అని ప్లే చేయడం వల్లే ఆ ఇంట్రస్ట్ పోయింది అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే బిగ్ బాస్ పైనల్ ఎపిసోడ్ కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఫిబ్రవరి 26న మొత్తం 17 మందితో ప్రారంభం అయిన ఈ షోని 12 వారాలు నిర్వహించనున్నట్లు ముందే తెలియజేశారు. ఆ తర్వాత 10 వారాల సమయంలో బాబా భాస్కర్ ని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపారు. ప్రస్తుతం హౌస్ లో 8 మంది ఉన్నారు అయితే వారిలో ఎవరికి టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం.
ఇదీ చదవండి: నాగార్జునపై అషు రెడ్డి ముద్దుల వర్షం!
బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ప్రస్తుతం.. అఖిల్, బిందు మాధవి, యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్, అరియానా, అనీల్, బాబా భాస్కర్(వైల్డ్ కార్డ్ ఎంట్రీ), మిత్రా శర్మ ఉన్నారు. వీరిలో అఖిల్, బిందు మాధవి మధ్య మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తోంది. టైటిల్ ఫేవరెట్ కూడా వీళ్లిద్దరే అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా నడుస్తున్న టాక్. ఇంక టాస్కులు, బిహేవియర్, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం విషయానికి వస్తే బిందు మాధవికి ఎక్కవ మార్కులు పడుతున్నాయి. అఖిల్ గట్టి పోటీ ఇచ్చినా కూడా ఏదొక విషయంలో బిందు మాధవి పైచేయి సాధిస్తోంది. మరోవైపు నటరాజ్ మాస్టర్ తో బిందు మాధవికి అయ్యే గొడవలు వల్ల ఆమెకే ఎక్కువ సింపథి లభిస్తోంది.ఇంక హౌస్ లో అందరూ ఆమెను అన్ని విషయాల్లో టార్గెట్ చేయడం కూడా బిందు మాధవిపై సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేస్తున్నాయి. మరోవైపు తెలుగమ్మాయి అనే సెంటిమెంట్ కూడా ప్రేక్షకులకు బాగానే హత్తుకుంది. సీజన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా బింధు మాధవి దాదాపు ప్రతి వారం నామినేషన్స్ లో ఉండి సేవ్ అవుతూ వస్తూనే ఉంది. టైటిల్ కూడా కొడుతుందనే టాక్ బాగా వినిపిస్తోంది. అంతేకాకుండా పర్ఫార్మెన్స్, టఫ్ ఫైట్ విషయంలోనూ బిందు మాధవి డిసర్వింగ్ హౌస్ మేట్ అంటూ చెబుతున్నారు. ఇప్పటివరకు బిగ్ బాస్ లో ఒక మహిళా ఇంటి సభ్యురాలికి కూడా టైటిల్ దక్కలేదనే అపవాదు బిందు మాధవితో తీరనుందని కామెంట్ చేస్తున్నారు. గతంలో బిగ్ బాస్ లో శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. ఇప్పుడు బిందు మాధవి ఏకంగా టైటిల్ కొడుతుందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. బిందు మాధవి టైటిల్ విన్నర్ కాగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.