బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ నుంచి బయటకు వెళ్లే మొదటి సభ్యుడు ఎవరు అని అంతా ఎదురు చూస్తున్నారు. నామినేషన్, ఎలిమినేషన్, కెప్టెన్సీ లాంటి విషయాల కంటే హౌస్‌లో సభ్యులు, ప్రేక్షకుల్లో సైతం కొన్ని విషయాలు ఇంట్రస్టింగ్ గా మారుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది.. రేవంత్- శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్ ఇష్యూనే. ఒకసారి రేవంత్ వచ్చి అర్జున్ కల్యాణ్‌కు శ్రీ సత్య- వాసంతి చెల్లెళ్లు అని చెప్తాడు. అప్పుడు అర్జున్ కల్యాణ్ మొదట కాదని వారించి ఆ తర్వాత కేవలం వాసంతి మాత్రమే తనకు సిస్టర్ గా అంగీకరిస్తాడు. శ్రీ సత్యను మాత్రం చెల్లి అని పిలవను అని తేల్చేశాడు. ఆ తర్వాత ఇదే విషయంపై రేవంత్- అర్జున్ కల్యాణ్ మధ్య చాలానే వాదనలు జరిగాయి. అర్జున్- రేవంత్ ని నామినేట్ చేసింది ఈ రీజన్ మీదే.
ఆ తర్వాత రేవంత్ మళ్లీ ఆ టాపిక్ తీసుకొస్తే శ్రీ సత్య కూడా అర్జున్‌తో మాట్లాడింది. ఎందుకు అలా చేస్తున్నావ్ అని అడగ్గా. నేను జస్ట్ జోక్‌గా అలా అన్నాను. వాసంతిని సైతం జోక్‌గా చెల్లి అన్నాను అంటూ అర్జున్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. శ్రీ సత్య కూడా అర్జున్ అలాంటి వాడు కాదు.. రాబోయే ముందే వాడికి చెప్పాను. కెమెరాలు ఉంటాయి చూసుకుని బిహేవ్ చేయి అని క్లారిటీ ఇచ్చింది. కానీ, ఆ వివాదం ఇంకా సమసిపోలేదు. అర్జున్- రేవంత్ మధ్య ఆ విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. నిజానికి వాళ్లు ఇప్పుడు ఫ్రెండ్స్ లాగే లేరు. రేవంత్ సైతం గ్యాప్ దొరికినప్పుడల్లా అదే టాపిక్ తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. అయితే మొదటిసారి శ్రీ సత్య ఆ విషయంలో సీరియస్ అయ్యింది.
రెండోవారం స్టార్టింగ్‌లోనే ఒకసారి గొడవ జరిగితే శ్రీ సత్య.. ఇంట్లోని వాళ్లంతా నా అన్నలే అంటూ కుండ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అర్జున్ ఆమె చుట్టూ తిరుగుతుండటం చూసి ఇంట్లోని సభ్యులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. కొందరైతే నేరుగా శ్రీ సత్యనే అడిగేస్తున్నారు. మీ మధ్య ఏమైనా ఉందా అని. తాజాగా అంతా స్విమ్మింగ్ పూల్‌లో దిగి ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో అర్జున్- శ్రీ సత్య వైపే చూస్తున్నాడు అనే విషయాన్ని గమనించి అభినయ వెళ్లి శ్రీ సత్యను.. మీ మధ్య ఏమైనా ఉందా అని అడిగిందంట. ఇంకేముంది శ్రీ సత్య ఆ విషయాన్ని రేవంత్‌తో చెబుతూ కెమెరాలు ఉన్నాయని తెలియదా? ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వాళ్లిద్దరు నాలుగేళ్లుగా మంచి మిత్రులు అని శ్రీ సత్యనే చెప్పింది. వారి మధ్య అయితే తప్పుగా ఏమీ లేదని ప్రేక్షకులు సైతం భావిస్తున్నారు. అర్జున్- శ్రీ సత్య మధ్య ఏముంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.