బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం వీకెండ్‌కు చేరుకుంది. బాలాదిత్య తర్వాత మోడల్ రాజశేఖర్ రెండోవారం కెప్టెన్‌గా ఛార్జ్ తీసుకున్నాడు. హౌస్‌లో కెప్టెన్సీ టాస్కు ద్వారా వివిధ ఎమోషన్స్ చూశారు. ఇప్పుడు మళ్లీ హౌస్‌లో మొత్తం అవే గ్రూపులు, కొట్లాటలు మొదలయ్యాయి. రేవంత్ అయితే నాతో ఎందుకు పెట్టుకున్నారా అని తెలిసేలా చేస్తానంటూ మరోసారి హౌస్మేట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి కెప్టెన్సీ టాస్క్ చాలా కొత్తగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. డీజే టిల్లూ అంటూ చంటి, ఇనయా, రాజశేఖర్, సూర్యలను నిల్చోబెట్టారు. వారికి నచ్చిన వారికి ఓటేయాల్సిందిగా బిగ్ బాస్ సూచించారు. వారిలో ఇద్దరు కలిసి ఏకాభిప్రాయంతో ఓటు వేయాలి. అందులో రాజశేఖర్‌కు 4, సూర్యాకి 2, చంటికి 1, ఇనయాకి ఒక ఓటు వచ్చింది.
ఈ డీజే టిల్లు కాంపిటీషన్లో ఒక పాట వేసి తర్వాత ఇద్దరిని పిలిచి ఓటు వేయాల్సిందిగా సూచించారు. ఆ సమయంలో చాలా సినిమా పాటలు వచ్చాయి. వాటికి ఇంట్లోని సభ్యులు అంతా మైమరిచిపోయి డాన్సులు వేశారు. కానీ, ఒక పాట రాగానే హౌస్ మొత్తం దద్దరిల్లి పోయింది. నిజానికి ఆ పేరు ఎక్కడ వినిపించినా రియాక్షన్ అదే రేంజ్లో ఉంటుంది. అవును మీరు అనుకున్నది కరెక్టే.. జై బాలయ్య సాంగ్ రాగానే హౌస్ మొత్తం రచ్చ రచ్చ చేశారు. అందరూ జై బాలయ్య సిగ్నేచర్ స్టెప్‌తో ఇరగదీశారు. పాట అయిపోయిన తర్వాత జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ కేకలు వేశారు. కొందరు కోకా కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ అంటూ స్లోగన్స్ కూడా ఇచ్చారు. ఆ ఒక్క పాటతో హౌస్ మొత్తం కొత్త ఉత్సాహం వచ్చింది.
ఇంక వీకెండ్ విషయానికి వస్తే.. నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. మొదటి వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నామినేషన్స్ లో గీతూ, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్-మెరీనా, రాజశేఖర్, ఫైమా, అభినయశ్రీ, షానీ ఉన్నారు. వీరిలో షానీ, అభినయశ్రీ మాత్రం డేంజర్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటివారం కూడా అభినయశ్రీ ఆఖరి వరకు వెళ్లి లాస్ట్ లో సేవ్ అయ్యింది. ఆ ప్రకారం కూడా అభినయశ్రీ ఈ వారం కూడా డేంజర్ జోన్లో ఉందనే చెప్పాలి. అనధికారిక ఓటింగ్స్ లో అటు షానీకి కూడా తక్కువ ఓట్లే పడుతున్నాయి. మరి ఎవరు ఎలిమినేట్ అవతారో వేచి చూడాల్సి ఉంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.