బిగ్ బాస్ కీర్తిభట్ కి బాయ్ ఫ్రెండ్ కావాలట. ఏంటీ ఈమె జీవితంలో విషాదమే ఉందనుకున్నాం, ఈ కోణం కూడా ఉందా అని టీవీ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక ఈ షోలో ప్రస్తుతమున్న వాళ్లు.. ఇప్పుడిప్పుడు ఆడియెన్స్ కి అలవాటుపడుతున్నారు. షోపై కూడా మెల్లమెల్లగా ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో ఫన్నీ టాస్కులు, పార్టిసిపెంట్స్ లైఫ్ స్టోరీలు ఆకట్టుకుంటున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ లో తొలి కంటెస్టెంట్ గా ‘కార్తికదీపం’ ఫేమ్ కీర్తి భట్ ఎంటరైంది. ఈమెని చూసి చాలామంది ఆ ఏముంది నార్మల్ పర్సనే కదా అని అనుకున్నారు.
వస్తూవస్తూనే తన ఫ్యామిలీ గురించి, వాళ్లందరూ కారు ప్రమాదంలో చనిపోవడం గురించి చెప్పి అందరినీ ఏడిపించేసింది. ఆ యాక్సిడెంట్ లో ఈమె మాత్రమే బతికింది. మొన్నటికి మొన్న కెప్టెన్సీ కోసం పెట్టిన ‘సిసింద్రీ’ టాస్కులో ఎవరికీ వారు, తమ జీవితంలోని బాధాకర సంఘటనల్ని బయటపెట్టారు. కీర్తి కూడా అలాంటిది చెప్పింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత డాక్టర్స్, తన గర్భసంచి తీసేశారని.. ఇక తనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పింది. ఓ పాపాయిని దత్తత తీసుకుంటే.. బిగ్ బాస్ హౌసుకి వచ్చే ముందు ఆ చిన్నారి కూడా చనిపోయిందని చెప్పి, హౌసులో ఉన్నవారితో పాటు అందరినీ ఏడిపించేసింది.
ఇదంతా పక్కనబెడితే బిగ్ బాస్ 6 ప్రారంభ ఎపిసోడ్స్ లో ఆర్జే సూర్యతో లవ్ లో పడుతుందేమో అనిపించింది. కానీ అది జరగలేదు. ఇక శుక్రవారం ఎపిసోడ్ లో మాత్రం తనకు అర్జంట్ గా బాయ్ ఫ్రెండ్ కావాలని చెప్పింది. ఇది చూసిన ప్రేక్షకులు.. కీర్తిలో ఈ కోణం కూడా ఉందా అని అనుకుంటున్నారు. కీర్తి కోరుకుంటున్నదని.. బిగ్ బాస్ హౌసులో త్వరలో జరుగుతుందేమో చూడాలి. ఆ లక్కీ పర్సన్ ఎవరైతే బాగుండని మీరనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: కీర్తీ భట్ జీవితంలో అంతులేని విషాదాలు! అవి అన్నీ నిజమేనా?