బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం చివరి రోజుల్లో హౌస్ మొత్తం గరం గరంగా మారిపోయింది. కొత్త కెప్టెన్ వచ్చాడు.. రాజశేఖర్ ఇప్పుడిప్పుడే నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ కాలేక పోయిన చంటి, ఇనయా, సూర్యలు మాత్రం గట్టిగానే ఫీలవుతున్నారు. ఇనయా సుల్తానా అయితే తెగ ఏడ్చేసింది. నాకు ఒక్క ఓటు కూడా పడలేదు అంటూ. ఆ తర్వాత నేహా చౌదరి, ఆరోహీరావులు కలిసి ఇనయా సుల్తానాకు ఓటు వేయడంతో చాలా సంతోష పడింది. ఇంక రేవంత్ మాత్రం రెండ్రోజులుగా ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో కనిపిస్తున్నాడు. ఎవరు కదిలించినా.. వారికి తన గోడు వెల్లబుచ్చుతున్నాడు. అంతేకాదు రేవంత్ మొదటి నుంచి తాను చెప్పాలనుకున్నది చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
మొదటివారం తన ప్రవర్తనపై నెగెటివ్ కామెంట్స్ రావడంతో రేవంత్ రెండోవారం చాలా సౌమ్యంగా, నిదానంగా మాట్లాడటం, మాట్లాడేముందు ఆలోచించడం లాంటివి కొన్ని ప్రయత్నించాడు. కానీ, తాను అలా చేయడం వల్ల ఇంట్లోని అందరికి చులకన అవుతున్నాడనే భావన రేవంత్‌లో కలుగుతోంది. తాను జోక్ చేస్తే అందరూ సీరియస్‌గా తీసుకున్నారని.. కానీ, ఎదుటివాళ్లు మాత్రం తనపై జోక్స్ చేస్తున్నారని వాపోయాడు. అంతేకాకుండా శుక్రవారం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా హీరో సుధీర్ బాబు- హీరోయిన్ కృతిశెట్టి బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. వాళ్లు సభ్యులకు కొన్ని ఫన్నీ టాస్కులు ఇచ్చారు.
ఆ టాస్కులో రేవంత్ మహేశ్ బాబు డైలాగ్ చెప్పేందుకు ప్రయత్నించాడు. నిజానికి చాలా బాగా చెప్పాడు కూడా. రేవంత్ పర్ఫామ్ చేసే సమయంలో చంటి కలగజేసుకోవడంతో అతనికి బాగా కోపం వచ్చింది. తర్వాత అదే విషయాన్ని శ్రీహాన్ తో మాట్లాడుతూ రేవంత్ కొన్ని కామెంట్స్ చేశాడు. “ఫైమాతో మనం ఆర్గ్యూ చేయలేం.. ఆమె ఏ విషయాన్ని అయినా ఫన్నీగా మార్చేస్తుంది. ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు.. ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు ఎవరు ఆ ఫైమా?(తన స్థాయి ఏంటి అనే అర్థం వచ్చేలా వేసిన ప్రశ్న)” అంటూ రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సుదీపా, మెరీనాలతో మాట్లాడుతూ తాను ఏదో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. రేవంత్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.