బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. హౌస్‌లో కొత్త కెప్టెన్ ఛార్జ్ తీసుకున్నాడు. మొదటివారం బాలాదిత్య హౌస్‌కి కెప్టెన్ కాగా.. రెండోవారం ఓటింగ్ విధానంలో మోడల్ రాజశేఖర్ కెప్టన్‌గా ఎంపికయ్యాడు. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ఉపయోగించుకోవడంలో భాగంగా చాలా మంది సినిమా సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు కూడా వస్తుంటారు. తాజాగా సుధీర్ బాబు- కృతిశెట్టి నటించి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా సెప్టెంబర్ 16న విడుదలైంది. ఆ సినిమా టీమ్ బిగ్ బాస్‌లో అడుగుపెట్టారు. అక్కడ సభ్యులతో సరదా టాస్కులు చేయించారు.
హౌస్మేట్స్ అంతా కొన్ని సినిమాల్లోని సీన్లను రీక్రియేట్ చేశారు. ఎక్కువగా మహేశ్ బాబుని ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా శ్రీహాన్- ఫైమా కామెడీ అందరినీ ఆకట్టుకుంది. శ్రీహాన్ నేను ఒక డైలాగ్ చెప్తాను అర్థమైపోతుంది అంటూ.. ఎవడాడు అంటాడు. అందుకు ఫైమా ఎవడీడు అంటూ సూపర్ టైమింగ్‌తో రియాక్ట్ అయ్యింది. రేవంత్ కూడా ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అంటూ మహేశ్‌ని ఇమిటేట్ చేసేందుకు ట్రై చేశాడు. ఇంక కొత్త కెప్టెన్ రాజ్ అయితే శ్రీ సత్యతో కలిసి ఓ సీన్ రీక్రియేట్ చేసేందుకు చాలా కష్టపడ్డాడు. ఆర్జే సూర్య అయితే నేహా చౌదరికి ప్రపోజ్ చేసేందుకు చాలా కష్టపడ్డాడు.
ఆ తర్వాత చంటి- ఆర్జే సూర్య- అభినయశ్రీ- షానీ సాల్మన్లు కలిసి ఒక స్కిట్ చేశారు. దానిలో చంటి ఆవేశంతో ఆర్జే సూర్య చొక్కా పట్టుకుని గుడ్లేసుకుని చూస్తావ్.. ఒక్క గుడ్డైనా పెట్టావా అంటూ ప్రశ్నిస్తాడు. చొక్కా పట్టుకున్నాడని కోపంలో ఆర్జే సూర్య చంటికి లెంపకాయ ఇస్తాడు. అది చూసిన షానీ కొట్రా అంటూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. మొత్తానికి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీమ్ హౌస్ మొత్తాన్ని నవ్వుల్లో ముచ్చెత్తిందనే చెప్పాలి. హౌస్మేట్స్ కూడా ప్రేక్షకులను నవ్వించేందుకు తెగ కష్టపడ్డారు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.