బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ తెలుగు రియాలిటీ షో అన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ మాత్రం కాస్త వెనుకబడింది అనే టాక్ బాగా వినిపిస్తోంది. కాస్త కాదులెండి బాగానే వెనకపడినట్లు కనిపిస్తోంది. అయితే ఇంకా రెండు వారాలు కూడా పూర్తి కాలేదు కాబట్టి.. ముందునాటికి ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కంటెంట్ ఇచ్చేందుకు ఇంట్లోని సభ్యులంతా తమవంతు కృషి చేస్తున్నారు. ఇంక బిగ్ బాస్ సైతం టాస్కులు, కెప్టెన్సీ పోటీదారులు అంటూ బాగానే గొడవలు పెడుతున్నాడు. కాకపోతే హౌస్‌లో ఎక్కువ మంది తెలిసిన ముఖాలు లేకపోవడం క్రేజ్ తగ్గడానికి కారణంగా చెబుతున్నారు.
ఇంక ఇంట్లోని సభ్యుల విషయానికి వస్తే.. రేవంత్, గలాటా గీతూలు హౌస్ మొత్తం రచ్చ రచ్చ చేస్తున్నారు. వాళ్లిద్దరు గనుక హౌస్‌లో లేకపోతే ప్రేక్షకులు చాలా ఫీలవుతారనే చెప్పాలి. అందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా హౌస్‌లో సభ్యులు స్విమ్మింగ్ పూల్‌లో చేసిన అల్లరి అందుకు బెస్ట్ ఉదాహరణ అవుతుంది. గురువారం రాత్రి.. మొదట శ్రీ సత్య వచ్చి స్విమ్మింగ్ పూల్‌లో దిగింది. ఆమె తర్వాత రేవంత్, బాలాదిత్య, గీతూ రాయల్ అంతా స్విమ్మింగ్ పూల్‌లో దిగారు. వారిలో చాలా మందికి స్విమ్మింగ్ కూడా రాదు. కానీ, అంతా సరదాగా గడిపేందుకు పూల్‌లో దిగి గోల చేశారు. వాళ్లంతా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్లు అనేది మర్చిపోయి ఎంజాయ్ చేశారు.
సాధారణంగా అందరికీ ఈత కొట్టడం అంటే సరదానే. వేసవిలో అందరూ చెరువులు, కాలువల్లో ఈత కొడతారు. సిటీలో అయితే అందరూ స్విమ్మింగ్ పూల్స్ కి వెళతారు. అక్కడకు వెళ్లిన వారిలో చాలా కామన్‌గా చేసే పని ఈత కొట్టే దగ్గర సూసూకి వెళ్లడం. అవును మీరు నవ్వుకున్నా కూడా అదే నిజం. అలా పూల్‌లో ఉండగా గీతూ అలాంటి కామెడీనే చేసింది. తాను చాలా సేపటి నుంచి ఆపుకుంటున్నాని.. చాలా అర్జంట్ అంటూ చెప్పింది. ఇంకా వెళ్లలేదు అని కూడా హింట్ ఇచ్చింది. అది అర్థం చేసుకున్న రేవంత్ పూల్‌లో ఉన్న వారిని అలర్ట్ చేశాడు. శ్రీ సత్య మాత్రం ప్లీజ్ బయటకు వెళ్లు, ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. మీరంతా అడుగుతున్నారు కాబట్టి వెళ్తున్నా బయటకి అంటూ గీతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలాదిత్య పిచ్చి మాటలు మాట్లాడకు అంటూ చిరు కోపం ప్రదర్శించాడు. హౌస్‌లో గీతూ చేసిన ఈ అల్లరిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.