బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్‌లో చాలా గ్రూపులు ఉన్నాయి. వాటిలో రేవంత్- అర్జున్- శ్రీహాన్- శ్రీ సత్య వీళ్లది కూడా ఒక గ్రూపు అనే అందరూ అనుకున్నారు. కానీ, అది నిజం కాదు అని శ్రీ సత్య నిరూపించింది. ఎందుకంటే ఫ్రెండ్ అని అనుకుంటున్న రేవంత్ గురించి ఇష్టారీతిన కామెంట్స్ చేసి అతనికే వెన్నుపోటు పొడిచినట్లు కనపించింది. నిజానికి శ్రీ సత్య విషయంలో అర్జున్ ఎప్పుడో రేవంత్ పార్టీ కాదని రుజువైంది. సమయం దొరికినప్పుడల్లా రేవంత్ గురించి వెనుక మాట్లాడుతూనే వచ్చాడు. ఇప్పుడు మొట్ట మొదటిసారి శ్రీ సత్య కూడా రేవంత్ గురించి వేరే వాళ్ల దగ్గర మాట్లాడటం మొదలు పెట్టింది. అయితే ఇది చూసిన రేవంత్ ఫ్యాన్స్ మాత్రం ఇది పక్కా వెన్నుపోటు పొడవడమే అంటూ కామెంట్ చేస్తున్నారు.
హౌస్‌లో చంటీకి పడని వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే మొదటి పేరు రేవంత్ అనే చెప్తాడు. అలాంటి శ్రీ సత్య వెళ్లి చంటి దగ్గర కూర్చుని రేవంత్ గురించి మాట్లాడటం మొదలు పెట్టింది. మొన్న మీరు పకోడీలు వేసే సమయంలో పిండి బాలేదని చెప్పారు కదా.. నేను అదే చెప్పాను అయినా రేవంత్ వినలేదు. నా మీదే అరిచాడు అంటూ శ్రీ సత్య ఏకరవు పెట్టడం మొదలు పెట్టింది. అందుకు చంటి.. ఏమన్నాడు? ఏ సందర్భంలో అన్నాడు అని కూపీ లాగడం ప్రారంభించాడు. అయితే తర్వాత వారి చిట్‌చాట్‌లో అర్జున్ కూడా చేరాడు. ఇంక వీళ్లంతా కలిసి రేవంత్ నిజ స్వరూపం బయటకు చూపించడం లేదు. బిగ్ బాస్ వాళ్లు వాళ్లకి కావాల్సిందే చూపించుకుంటున్నారు. అందుకే ఫ్యాన్స్ లో రేవంత్‌కి అంతా పాజిటివ్‌గా ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
శ్రీ సత్య.. ఇన్ని రోజులు నేను ఎందుకులే అని ఊరుకున్నాను. అందరూ నామినేట్ చేస్తే మళ్లీ హీరో అయిపోతాడు అని లైట్ తీసుకున్నాను అన్నట్లు చెప్పుకొచ్చింది. ఇకపై నేను కూడా నామినేట్ చేస్తానంటూ ఫిక్స్ అయిపోయింది. అయ్యిందే తడవుగా నామినేట్ కూడా చేసింది. రేవంత్ నువ్వు అలా అరవడం నాకు నచ్చలేదు అంటూ రీజన్ చెప్పింది. అయితే రేవంత్ కూడా తిరిగి శ్రీ సత్యను నామినేట్ చేశాడు. కానీ, ఒకే ఓటు రావడం వల్ల శ్రీ సత్య నామినేషన్స్ లోకి రాలేదు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా శ్రీ సత్య, అర్జున్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. మీ మిత్రుడు మీద కోపం వస్తే అది అతనికి చెప్పాలి. అంతేగానీ అతడిని ద్వేషించే వ్యక్తి చెప్పడం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని తప్పకుండా వెన్నుపోటనే అంటారు అంటూ కామెంట్ చేస్తున్నారు.