బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 హౌస్లో ఎన్నో అంతుపట్టని విషయాలు జరుగుతున్నాయి. కొన్ని విషయాలు అర్థమయ్యేలాగే ఉన్నా.. అర్థం కావడం లేదంటూ ప్రేక్షకులు సైతం జుట్టు పట్టుకుంటున్నారు. అలాంటి వాటిలో ఆర్జే సూర్యా- ఆరోహీలు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే వాళ్లిద్దరు ఫ్రెండ్సా? లవర్సా? అనే విషయంలో క్లారిటీ కోసం ప్రేక్షకులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున కూడా వీకెండ్లో ఒక ఫొటో చూపించి ప్రేక్షకుల మధ్య నడుస్తున్న ఊహాగానాలకు ఆర్జం పోసినట్లు అయ్యింది. వాళ్లు నిజానికి ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ ఉంటారు. కానీ, వాళ్ల ప్రవర్తన మాత్రం అలా అనిపించదు. ప్రేక్షకుల్లో ఒకావిడ.. మాకూ ఫ్రెండ్స్ ఉన్నారు గానీ, ఇలా నుదిటి మీద ముద్దు పెట్టే ఫ్రెండ్స్ లేరంటూ కామెంట్ చేసింది.
తమన్నా వచ్చిన సమయంలో కూడా వాళ్ల మధ్య ఏదో ఉందని నాగార్జున సైతం కామెంట్ చేశాడు. అందుకు ఆరోహీ రావ్ మూడేళ్లలో కలగనిది ఇప్పుడు ఎందుకు కలుగుతుంది అని తప్పించుకుంది. ఇటీవల సూర్యా- ఆరోహీ రాత్రి పూట పూల్ పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే.. శ్రీ సత్య వచ్చి మీఇద్దరి మధ్య ఏముంది? మీరు నిజంగానే ఫ్రెండ్సా? అంటూ నేరుగా ప్రశ్నించింది. కానీ, వాళ్లు మాత్రం సమాధానం చెప్పకుండా దాటేశారు. తాను ఇండిపెండెంట్ అంటూనే టాస్కులు రాగానే సూర్యాని గెలిపించేందుకు ఆరోహీ తెగ ట్రై చేస్తూ ఉంటుంది. అడవిలో ఆట సమయంలో తన డబ్బు మొత్తం సూర్యాకు ఇచ్చేసి టాప్ 2లో నిల్చోబెట్టింది. కానీ, తాము ఫ్రెండ్స్ మాత్రమే అంటూ చెప్తూ ఉంటుంది.
అయితే తాజాగా వీళ్లు ఇద్దరూ హౌస్లో కొట్టుకున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టేసుకున్నారు. ఆ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి వాళ్లు కొట్టుకుంది సరదాగే అయినా.. ఆ ఫైట్ వాళ్ల మధ్య ఉన్న రిలేషన్- క్లోజ్ నెస్ని చూపిస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు. ఉదయం చక్కగా రెడీ అయి కూర్చున్న సూర్యా దగ్గరకు ఆరోహీ వస్తుంది. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పిన తర్వాత సూర్యా జుట్టు మొత్తం చెరిపేస్తుంది. అయితే సూర్యాకి జుట్టు చెరిపితే కోపం అందుకే అలా రియాక్ట్ అయ్యాడు. తర్వాత సూర్యా కూడా ఆరోహీ రబ్బర్ బ్యాండ్ లాగేసి గోలచేశాడు. ఈ సరదా సన్నివేశం వీళ్ల మధ్య ఏం రిలేషన్ ఉంది? అనే ప్రశ్నని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. సూర్యా- ఆరోహీ నిజంగానే ఫ్రెండ్సా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.