బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. మూడోవారం ఎలిమినేషన్‌లో ఎవరూ ఊహించని విధంగా నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యింది. నిజానికి నేహా చౌదరి ఇంత త్వరగా హౌస్ నుంచి బయటకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎంతో స్ట్రాంగ్ ప్లేయర్‌గా హౌస్‌లో అడుగుపెట్టి మూడోవారమే తిరిగి రావడంపై నేహా కూడా ఎంతో షాక్‌లో ఉంది. నిజానికి ఇంత త్వరగా వస్తానని తాను కూడా ఊహించలేదని చెప్పుకొచ్చింది. కానీ, బిగ్ బాస్ అంటేనే ఎక్స్ పెక్ట్ ది అన్ ఎక్స్ పెక్టెడ్ అని వ్యాఖ్యానించింది. ఉన్నన్ని రోజులు ఆ ఎక్స్ పీరియన్స్ ని ఎంజాయ్ చేశానని ఆనందం వ్యక్తం చేసింది.
నేహా చౌదరి రాబోయే ముందు హౌస్‌లో దుమ్ము అని ఇనయ సుల్తానా, సింగర్ రేవంత్, ఆరోహీ, గీతూ, అర్జున్ కల్యాణ్, వాసంతిల పేర్లు పెట్టింది. ఇంక రాజ్ తో తనకు ఎంతో మంచి బాండింగ్ ఏర్పడిందని నేహా చౌదరి చెప్పుకొచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ఒక అబ్బాయిని ఫ్రెండ్‌గా యాక్సెప్ట్ చేశానని కామెంట్ చేసింది. అంతేకాకుండా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయాలు తనని ఆశ్చర్యపోయేలా చేశాయంది. నిజానికి వీళ్లేంటి ఇలా ఉన్నారు అని అనుకున్న వాళ్లంతా బయట ఓటింగ్స్ లో లీడ్‌లో ఉన్నారంటూ నేహా విస్మయానికి గురైంది. వాళ్ల పేర్లు చెప్పకపోయినా కూడా.. రేవంత్- గీతూ- ఆరోహీ- ఇనయా లాంటి వారిని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఇంక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాక తాను 6 కేజీలు తగ్గినట్లు చెప్పి నవ్వుకుంది. అంతేకాకుండా హౌస్‌లో తనకి తగిలిన గాయాలను చూపిస్తూ నేహా ఒకింత ఆశ్చర్యం, ఒకింత ఆనందానికి గురైంది. అంటే ఫిజికల్ టాస్కుల్లో ఆమెకు తగిలిన దెబ్బలను చూపిస్తూ వాటి వల్లే తాను టాస్కుల్లో వెనుకబడినట్లు చెప్పుకొచ్చింది. కానీ, ఎన్ని దెబ్బలు తగిలినా తన బెస్ట్ ఇచ్చేందుకు కృషిచేశానంది. టాస్కు అయిన తర్వాత స్నానం చేసే సమయంలో ఇక్కడ ఎలా దెబ్బ తగిలింది అంటూ చూసుకునే వాళ్లమంటూ నేహా చెప్పింది. ఒంటిపై ఉన్న గాయాలు, కమిలిపోయిన మచ్చలు చూపిస్తూ కాస్త భావోద్వేగానికి గురైంది. బిగ్ బాస్ లో ఉన్న రోజులు మాత్రం మెమొరబుల్‌గా ఉండిపోతాయంటూ వ్యాఖ్యానించింది. నేహా చౌదరి మూడోవారమే ఎలిమినేట్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.