బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఆట పరంగా దూసుకుపోతున్నా కూడా.. ప్రేక్షకుల్లో మాత్రం మార్క్ చూపించలేకపోతోంది. మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగోవారంలోకి అడుగుపెట్టింది. నాలుగో వారం నామినేషన్స్ లో మొత్తం 10 మంది ఇంటిసభ్యులు ఉన్నారు. ఈసారి కూడా దాదాపుగా అన్ని పేర్లు రిపీటెడ్ గానే ఉన్నాయి. హౌస్‌లో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మొట్ట మొదట వినిపించే పేరు గీతూ రాయల్. హౌస్‌లో మొదటివారం నెగెటివిటీ మూటకట్టుకుని తర్వాత హౌస్‌లో స్టార్ ప్లేయర్ అని నిరూపించుకుంది. ఆ తర్వాత నాగార్జునానే చప్పట్లు కొట్టి 200 శాతం పర్ఫార్మ్ చేశావ్ అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి గీతూ లేకపోతే చాలా మంది బిగ్ బాస్ కూడా చూడరు అంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి.
తొలివారంలో జరిగిన కెప్టెన్సీ పోటీ తర్వాత గీతూ రాయల్ ఆట, మాట తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. హౌస్ మేట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు సైతం ఇదేమీరా స్వామీ నాయనా ఇట్టుంది అనుకునే పరిస్థితి. కానీ, రెండోవారం సిసింద్రీ గేమ్‌తో ఆట స్వరూపాన్ని, ఆమె మీదున్న అభిప్రాయాలను తుడిచి పారేసింది. ఒక్కతే ఇంటిల్లపాదిని ఆడుకున్న తీరు అందరినీ మంత్ర ముగ్దులను చేసింది. ఒక్క అమ్మాయి మనందరినీ నిద్రపోకుండా చేసిందే అంటూ సభ్యులు మొత్తం తలలు పట్టుకున్నారు. ఎత్తుకు పైఎత్తు వేస్తూ ఆమె ఆడిన తీరు మెచ్చుకోదగినదే. అయితే గీతూ రాయల్కి ఉన్న నోటిదూలే(ఈ మాట మనం అంటున్నది కాదు. హోస్ట్ నాగార్జున చెప్పింది.. గీతూ రాయల్ అవును అని అంగీకరించిన విషయమే) తలనొప్పి తెచ్చిపెడుతోంది.
అయితే గత రెండ్రోజుల్లో జరిగిన అప్డేట్స్ ప్రకారం మళ్లీ గీతూ రాయల్ నెగెటివిటీ జోన్లోకి వెళ్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. అందుకు ఉదాహరణలు సైతం ఉన్నాయి. ఇటీవల తల్లి ప్రేమను కుక్క ప్రేమతో పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు తావిచ్చాయి. ఇంక తాజాగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో గీతూ చేసిన వ్యాఖ్యలు ఇంకా నెగిటివ్ అవుతున్నాయి. లవ్, బ్రేకప్స్ గురించి సుదీపా- గీతూ- బాలాదిత్య- ఆదిరెడ్డి మాట్లాడుకుంటూ కూర్చుకున్నారు. ఆ మాటల సందర్భంగా గీతూని సుదీపా పింకీ నీకు ఏమైనా బ్రేకప్ స్టోరీలు ఉన్నాయా అని అడుగుతుంది. అందుకు గీతూ సమాధానం చెప్పకుండా చూసిన చూపుతో.. అర్థమైందిలో అంటూ సుదీపా సైలెంట్ అయిపోతుంది.
బాలాదిత్య మాట్లాడుతూ గీతూ రాయల్ మీ బాయ్‌ఫ్రెండ్ ఏం చేస్తాడు అని అడిగాడు. ఇంకెక్కడ బాయ్ ఫ్రెండ్ ఆమెకు పెళ్లి కూడా అయిపోతే అంటూ సుదీపా సమాధానం చెబుతుంది. అదే మీ భర్త బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారు అంటూ బాలాదిత్య మళ్లీ ప్రశ్నించాడు. అందుకు నాకు తెలియదు ఏం చేస్తాడో ఏమో.. అంటూ గీతూ రాయల్ చాలా చిరాకు లుక్‌తో సమాధానం చెబుతుంది. నాకైతే నెలానెలా డబ్బులిస్తాడు అంటూ చాలా కేర్ లెస్ సమాధానం చెప్పింది. తర్వాత ఏదో హెల్త్ కేర్ దాంట్లో చేస్తాడులే అంటూ చెప్పుకొచ్చింది. కట్టుకున్న భర్త ఏం చేస్తాడో కూడా తెలియదా తల్లీ అంటూ గీతూ అంటే గిట్టని వాళ్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే బిగ్ బాస్ లాంటి చోట వేరే కంపెనీల పేర్లు, ఉద్యోగాలు ప్రస్తావనలు తీసుకురాకూడదు. అందుకే గీతూ రాయల్ చెప్పి ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.