బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఉత్కంఠే కాదు ఉత్సాహంగా సాగుతోంది. ఈ రియాలిటీ షో వల్ల కెరీర్‌లో వెనుకబడిన వాళ్లు తిరిగి సెకంట్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా స్టార్లుగా వచ్చి సెలబ్రిటీలు కూడా అయ్యాయి. అయితే ఈ షో ద్వారా ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. అంటే బయట ఇంట్లోని సభ్యుల విషయంలో నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అనవసరంగా క్యారెక్టర్ బ్యాడ్ కావచ్చు. కొన్నిసార్లు రిలేషన్ కూడా బ్రేక్ కావచ్చు. ఇప్పటికే షణ్ముఖ్ జశ్వంత్- దీప్తీ సునైనా జంట అందుకు ఉదాహరణగా నిలిచారు. హౌస్‌లో షణ్ముఖ్- సిరి క్లోజ్ గా ఉన్నారంటూ బయట బాగా ప్రచారాలు జరిగడం, ఆ తర్వాత దీప్తీ సునైనా బ్రేకప్ చెప్పడం అందరికీ తెలుసు.
మరోవైపు సిరి విషయంలో శ్రీహాన్ సైతం బాధపడ్డాడు. ఆమె గురించి అలాంటి ప్రచారాలు జరగడం చూసి తట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో శ్రీహాన్ కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే శ్రీహాన్ బిగ్ బాస్ కు వెళ్లకూడదంటూ చాలా మంది కోరుకున్నారు. మళ్లీ అతడిని కూడా బ్యాడ్ చేస్తారంటూ కామెంట్ చేశారు. అయితే శ్రీహాన్ మాత్రం తానేంటో ప్రూవ్ చేసుకుంటానంటూ బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లాడు. అక్కడ మొదటి రోజు నుంచీ శ్రీహాన్ జాగ్రత్తగానే ఉంటున్నాడు. అయితే ఏ అమ్మాయితో క్లోజ్‌గా ఉంటే బయటకు ఎలా వెళ్తుందో అంటూ భయపడుతూనే ఉన్నాడు. మొదటివారం మొత్తం ఎంతో జాగ్రత్తగా ఉన్న శ్రీహాన్ ఇంట్లోని సభ్యుల వద్ద ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కాస్త లిబరల్‌గా వ్యవహరించడం ప్రారంభించాడు.
తాజాగా రాత్రిపూట లైట్స్ ఆపేసిన తర్వాత శ్రీహాన్ విషయంలో ఇంట్లోని అమ్మాయిలు శ్రీ సత్య, వాసంతి ఒక చర్చ మొదలు పెట్టారు. అంతా అర్ధరాత్రి ఒకే బెడ్ మీద కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేశారు. శ్రీహాన్ మెడమీద ఎవరో కొరికారు అంటూ చెప్పుకొచ్చారు. అక్కడ గాట్లు కూడా ఉన్నాయి. కానీ, కొరికింది ఎవరో అతనికి తెలియదు అంటున్నాడు. అక్కడే ఉన్న అర్జున్ సిగ్గు పడుతున్నాడంటూ జోక్ గా శ్రీ సత్య అర్జున్ అలా చేశాడంటూ కామెంట్ చేసింది. కానీ, ఎవరు కొరికింది అనేది మాత్రం క్లారిటీ రాలేదు. శ్రీహాన్ కూడా ఎంత చనువుగా ఉన్నా.. అతని లిమిట్స్ లో ఉంటూ ఉంటాడు. ఈ డిస్కషన్ లో మాత్రం అందరూ అంత క్లోజ్ కూర్చొని లైట్లు ఆపిన తర్వాత చర్చలు చేస్తుంటే కొందరు శ్రీహాన్ విషయంలోనూ భిన్నంగా స్పందిస్తున్నారు.
ఇప్పుడు శ్రీహాన్ ఎలాగైతే అందరితో కలిసి సరదాగా ఉంటున్నాడో అప్పుడు సిరీ హన్మంత్ కూడా అలాగే ఉంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సిరిని కావాలనే నెగెటివ్ చేశారంటూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు శ్రీహాన్ సైతం అలాగే చేస్తున్నాడు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అందరితో క్లోజ్ గా ఉంటున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. అప్పుడు సిరిని చూసి బాధపడిన శ్రీహాన్.. ఇప్పుడు ఇలా చేస్తే సిరి కూడా శ్రీహాన్‌ని చూసి బాధపడుతుంది కదా అంటున్నారు. నిజానికి శ్రీహాన్ ఎంతో లిమిట్స్ లోనే ఉంటున్నాడని ఫ్యాన్స్ సమర్ధిస్తున్నారు. ఈ ఫన్నీ చర్చ ఇప్పుడు శ్రీహాన్ విషయంలో చాలా పెద్ద చర్చకే తెర లేపింది. మరి.. శ్రీహాన్ గేమ్ ప్లే విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.