బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అనుకున్న దానికన్నా ఎక్కువగానే రాణిస్తోంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అటు టీవీలో, ఇటు ఓటీటీలో సైతం ఈ షోని ఆదరిస్తున్నారు. ఈ సీజన్లో మాత్రం మొదలైనప్పటి నుంచీ గొవడలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నామినేషన్స్ లో అయితే పెద్ద ఎత్తునే రచ్చ జరిగింది. ముఖ్యంగా రేవంత్- గీతూలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. గీతూ రాయల్ విషయంలో ఇంకా నెగెటివిటీ తగ్గలేదు. ఇంట్లోని సభ్యులు ఎంత చెప్పినా గీతూ మాత్రం తనకు నచ్చినట్లు మాట్లాడుతోంది. ఆమె మాటలు తమకు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయంటూ చాలా మంది ఇప్పటికే కంప్లైంట్ చేశారు. రేవంత్ కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు. ఆమెను నామినేట్ చేయాలన్నా ఛీఛీ అనిపిస్తోందన్నాడు.
ఇంక నామినేషన్స్ లో ఆర్జే సూర్య, గలాటా గీతూల మధ్య గొడవ జరిగింది. ఆర్జే సూర్య చెప్పిన కారణం ఏంటంటే.. గీతూ అలా కార్డులు అన్నీ తన దగ్గర పెట్టుకోవడం వల్లే తన గేమ్ పోయిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆమె ఎక్కడైనా చేతులు పెట్టి తీసుకోవచ్చని ఛాన్స్ ఇచ్చినా అలా చేసే వాళ్లు ఛాన్సు తీసుకునే వాళ్ల ఎవరూ లేరంటూ క్లారిటీ ఇచ్చాడు. తమకు సంస్కారం ఉందని, ఆడవాళ్లను గౌరవించడం తమకు బాగా తెలుసనని సూర్యా చెప్పుకొచ్చాడు. అయితే ఆర్జే సూర్యా మాటలకు గీతూ ఒకవైపు ఒప్పుకుంటూనే మరోవైపు తన వాదనను వినిపించింది. తన వ్యాఖ్యలకు తానేమీ బాధ పడటం లేదనే ధోరణిలోనే మాట్లాడింది.
“నేను అలా చేసిన వ్యాఖ్యలు తప్పు కావచ్చు. నేను ఇక్కడికి గెలవడానికి వచ్చాను. బిగ్ బాస్ అంటే ఒక వార్ లాంటింది. వార్‌లో రాజులు రాజ్యాలను గెలవడానికి ఎలాగైతే స్ట్రాజీలు వాడతారు నేను అలాగే వాడుతాను. వార్‌లో ఏదైనా ఫేరే అవుతుంది. నాకు మీరు కంటెండర్, మీరు నా టార్గెట్. నేను గెలవడం కోసం నేను ఏదైనా చేస్తాను. నేను ఒక దగ్గర దాచిపెడుతున్నాను అంటే దాన్ని తీసేందుకు పక్కన వాళ్లు ట్రై చేస్తారు. నీకు తీసేదానికి ఇబ్బందిగా ఉంటే అది నీ ప్రాబ్లమ్. టాస్కులో నాకు అబ్బాయి, అమ్మాయి అనే తేడా లేదు. నువ్వు ఎక్కడ దాచిపెట్టుకున్నా నేను తీసేదానికి ట్రై చేస్తాను. నేను చేతులు పెట్టడం నీకు ఇబ్బంది అయితే నువ్వు అక్కడ దాచిపెట్టుకోకు” అంటూ గీతూ రాయల్ స్పష్టం చేసింది. అయితే ప్రతిసారి ఈ చేతులు పెట్టే టాపిక్ రావడంతో ప్రేక్షకులు ఛీ ఇద్దెక్కడి దరిద్రంరా స్వామి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ చేతులు పెట్టే కాన్సెప్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.