బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఆట జోరు పెరిగింది. నామినేషన్లు, టాస్కులు అంటూ వారిలో వాళ్లు తెగ కొట్టేసుకుంటున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత హౌస్ చల్లబడిందని భావించారు అంతా. కానీ, టాస్కు పేరుతో మళ్లీ రచ్చ మొదలైంది. ఈసారి కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ చాలా కష్టమైన టాస్క్ ఇచ్చాడు. అందరికీ తలా ఒక చంటిపిల్ల బొమ్మ ఇచ్చి దానిని బాగా చూసుకోవాలని చెప్పారు. సమయానికి నిద్రపుచ్చడం, పాలు తాగించడం లాంటివి చేయాలని చెప్పారు. అలా ఎవరైతే పాపాయిని బాగా చూసుకుంటారో వాళ్లు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. ఈ టాస్కులో మళ్లీ సబ్ టాస్కులు కూడా ఉన్నాయి.
గోనె సంచుల్లో నిల్చొని కొన్ని షేప్స్ తీసుకుని దూరంగా పెట్టిన బోర్డుకి పెట్టాలి. ఈ టాస్కులో హౌస్‌లోని సభ్యులు పోటీ పడ్డారు. కానీ, ఇద్దరి మధ్య మాత్రం మాటల యుద్ధం జరిగింది. వాళ్లే చలాకీ చంటీ- సింగర్ రేవంత్. ఉదయం టిఫిన్ సయమలోనూ ఇద్దరూ చక్కగా కలిసి కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. కానీ, టాస్కులో మాత్రం ఇద్దరూ శత్రువులుగా మారిపోయారు. చంటి విషయంలో రేవంత్ చాలా సీరియస్ అయ్యాడు. “ఒకర్ని ఓడించాలని చూస్తే మనమే ఓడిపోతాం. చంటన్నా హ్యాపీ ఫర్ యూ. అలా అయితేనే గెలుస్తాం” అంటూ రేవంత్ కామెంట్ చేశాడు. ఆ మాటలు వింటూ చంటి ఏం అర్థం కానట్లుగా ఉండిపోయాడు. ప్రస్తుతం ఆ ప్రోమో వైరల్ అవుతోంది.
ఇంక ఈ వారం నామినేషన్స్ విషయానికి వస్తే.. మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ కొత్త రూల్ తీసుకొచ్చాడు. ఇంట్లోని సభ్యులు ఒక్కొక్కరు ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలంటూ చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్ కి మాత్రం ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు. బాలాదిత్య షానీ, రాజశేఖర్‌లను నామినేట్ చేశాడు. అసలు ఈ వారం నామినేషన్లో.. రేవంత్, గీతూ రాయల్, రాజశేఖర్, ఆదిరెడ్డి, రోహిత్-మరీనా, అభినయశ్రీ, ఫైమా, షానీ ఉన్నారు. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారా అంటూ ప్రేక్షకులు ఇప్పటి నుంచి ఊహాగానాలు ప్రారంభించారు. రేవంత్ vs చంటి విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.