బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రారంభానికి ముందుగా మాటిచ్చినట్లే ఈ షోని ఉండేకొద్దీ ఉత్కంఠగా కొనసాగిస్తున్నారు. బిగ్ బాస్ వాళ్లు ఆదివారం అంటే వన్ డే అంటారు గానీ, ప్రేక్షకులకు మాత్రం సోమవారమే ఫన్ డే. ఎందుకంటే ఆరోజు నామినేషన్స్ ఉంటాయి కాబట్టి. అందరూ ఎదురుచూసినట్లుగానే నామినేషన్స్ లో ఇంట్లోని సభ్యులు పెద్ద పెద్ద మాటల యుద్ధాలు చేశారు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ నానా రచ్చ చేశారు. గ్యాప్ ఇస్తే కొట్టేసుకుంటారేమో అనేలా బిహేవ్ చేశారు. అయితే ప్రేక్షకులకు కావాల్సిన కంటెట్ అదే కాబట్టి వాళ్లు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వారం నామినేషన్స్ లోనూ గలాటా గీతూ, రేవంత్ ఇద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వాళ్లిద్దరిపైనే సభ్యుల కంప్లైంట్లు కూడా ఉన్నాయి.
అయితే వాళ్ల మీద ఇతర సభ్యులు చేసిన నామినేషన్ల కంటే వాళ్లిద్దరి మధ్య జరిగిన నామినేషన్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సింగర్ రేవంత్– గీతూని నామినేట్ చేశాడు. ఆ సమయంలో ఆమెపై చాలానే ఫిర్యాదులు చేశాడు. “నేను ఏం మారలేదని నన్ను నామినేట్ చేశావ్. నేను ఏం మారానో నీ ముందు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం గానీ, అంత కర్మగానీ నాకు లేదు. అసలు ఈ పిల్లని నామినేట్ చేయాలనుకున్నా నాకు ఛీఛీ అనిపించింది. నువ్వు గట్టిగా మాట్లాడావని నేను కూడా గట్టిగా మాట్లాడితే నీకు నాకు తేడా ఏముంది? పక్కోళ్లని ఎంచుతావు కదా? వీళ్లు ఇలాగా వాళ్లు ఇలాగా అని నువ్వు మాట్లాడుతావేమో.. మాకు ఉన్నాయి” అంటూ రేవంత్ చెప్పుకొచ్చాడు.
“ఎక్స్ ట్రాలు మాట్లాడకు నీతో మాట్లాడాలనుకున్నా నాకు చిరాకుగా ఉంది. నీ విషయంలో ఎక్కువ సోది మాట్లాడను ఎందుకంటే వేస్ట్ అది. నేను ఎక్కువ మాట్లాడను. అశుద్ధం మీద రాయేస్తే మన మీద దొర్లుతాది. అట్లాంటి క్యారెక్టర్ నువ్వు. నేను ఎక్కువ మాట్లాడను నీ మైండ్ ని చేంజ్ చేసే ఉద్దేశం లేదు. నేను నాలా ఉంటాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్లు చెప్తారు. నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను” అంటూ రేవంత్ చెప్పుకొచ్చాడు. ఈ గ్యాప్‌లో గీతూ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. రేవంత్ ఫుల్ సీరియస్‌గా మాట్లాడుతుంటే గీతూ మాత్రం ఐ లైక్ యూ అంటూ రేవంత్‌ని ఇంకా రెచ్చగొట్టింది. వీళ్ల మధ్య వార్ మాత్రం ఇప్పుడప్పుడే తెగేలా కనిపించడం లేదు. రేవంత్– గీతూ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.