బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదుంది. కెప్టెన్సీ టాస్కుతో ఇంట్లోని సభ్యులు రెండు గ్రూపులుగా మారిపోయి కొట్టేసుకుంటున్నారు. టాస్కులు, కొట్లాటలు మాత్రమే కాదు.. బిగ్ బాస్ హౌస్‌లో హగ్గులు, కిస్సులు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఒక్కో సీజన్లో ఒకటి, రెండు జంటలు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి దృశ్యాలు చూసినప్పుడల్లా సీపీఐ నారాయణ లాంటివారు అదొక బ్రోతల్ హౌస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే వాళ్లు అనడం ఎలా ఉంటుందో.. వీళ్ల పనులు కూడా అలాగే ఉంటాయి. గత సీజన్లలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. వాటన్నింటిలో ముఖ్యంగా షణ్ముఖ్ జశ్వంత్- సిరి హన్మంత్‌ల గురించి మాత్రం బాగా కాంట్రవర్సీలు కావడం చూశాం. బిగ్ బాస్ ద్వారా షణ్ముక్ రిలేషన్ కూడా బ్రేక్ అయ్యింది.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ అలాంటి జంట ఒకటి ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. ఆర్జే సూర్య– ఆరోహీ రావు. వీళ్లిద్దరు మూడేళ్లుగా మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నారు. వాళ్ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒకరికి ఒకరు మంచి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉంటామని చెబుతున్నారు. అయితే వాళ్ల చర్యల మీద మాత్రం ప్రేక్షకులు వేరేలా స్పందిస్తున్నారు. వారి మధ్య సంథింగ్ ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రెండోవారం వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున కూడా ఏదో ఉంది అంటూ ప్రేక్షకులతో చెప్పించడం చూశాం. 100% లవ్ సినిమాలో ఫ్రెండ్‌షిప్ తర్వాత ఏమైంది అంటూ తమన్నాను ప్రశ్నించి.. ప్రేమ అని చెప్పించారు.
అంతేకాకుండా హౌస్‌లో ఆరోహీ రావ్– సూర్యల మధ్య హగ్గులు, కిస్సులు కూడా నడుస్తున్నాయంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఆరోహీ- రేవంత్‌తో గొడవ పడిన తర్వాత ఆరోహీ వెళ్లి కూర్చొని ఏడుస్తున్న సమయంలో సూర్య ఓదార్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు నుదుటిపై ముద్దు పెట్టి హత్తుకుని ఓదార్చాడు. అయితే ఆ సన్నివేశాన్ని ఎవరూ తప్పుగా తీసుకోలేదు. కానీ, ఆ తర్వాత జరిగిన ఘటనలు మాత్రం కాస్త అనుమానాలు రేకెత్తించేవిగానే ఉన్నాయి. ఒకసారి ఆరోహీ అలిగితే సూర్య సారీ చెప్పకుండా ముద్దులు పెడుతున్నట్లు సౌండ్లు చేశాడు. దానిపై ప్రేక్షకులు ప్రశ్నలు మొదలు పెట్టారు. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ ముద్దులు పెట్టుకుంటారో మాకు చెప్పండి అంటూ డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా గత శనివారం ఎపిసోడ్‌లో సూర్య దిగాలుగా బాత్‌రూమ్‌కి వెళ్లగా.. వెనకాలో ఆరోహీ కూడా వెళ్లింది. అతడికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత సూర్య- ఆరోహీని గట్టిగా హత్తుకున్నాడు. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో షానీ సాల్మన్ స్పందించాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఏదో జరుగుతోందని నిరూపించేందుకు యాంకర్ ప్రయత్నించగా.. షానీ సాల్మన్ మాత్రం ఆ మాటలను ఖండించాడు. “నారాయణ గారు చెప్పినట్లు అక్కడ ఏం జరగదు. హౌస్‌లో 70 కెమెరాలు ఉన్నాయి. ఏ ఇద్దరు ఓ మూలన ఉన్నా కెమెరాకు కనిపిస్తుంది. చిన్న శబ్ధం అయినా రికార్డ్ అవుతుంది. ఎవరైనా ఒకరిని హగ్ చేసుకున్నారు అంటే వారి మధ్య ప్రేమో ఉందని చెప్పలేం. ఒక్కోసారి ప్రశంసించే సందర్భంలో ముద్దు కూడా పెడతారు. వాళ్లిద్దరూ క్లోజ్ అనే మాట వాస్తవం. కానీ, వారి మధ్య ఏదో ఉంది అని చెప్పలేం. ఫ్రెండ్స్ మధ్య కూడా లవ్ ఉండొచ్చు. ప్రతిది లస్ట్ తో కూడిన లవ్ అనుకోకూడదు. నేను ఇలాంటివి చేయలేదు కాబట్టే బయట ఉన్నాను” అంటూ షానీ సాల్మన్ క్లారిటీ ఇచ్చాడు. సూర్య- ఆరోహిల మధ్య ఉన్నది ప్రేమా? స్నేహమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.