బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఫుల్ స్పీడు అందుకుని మళ్లీ పరుగులు పెడుతోంది. రెండోవారం వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఇంట్లోని సభ్యులు మొత్తం సోఫాలు వదిలి గేమ్‌లోకి దిగారు. ఎవరినైతే మీరు గేమ్ ఆడటంలేదు అంటూ తొమ్మిది మందిని వెనుక నిల్చోబెట్టి క్లాస్ పీకాడో వాళ్లంతా ఇప్పుడు మైదానంలో పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా శ్రీ సత్య అయితే కెప్టెన్సీ టాస్కులో ఇరగదీస్తోంది. మాటలు, చేతలు, స్ట్రాటజీలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నడుస్తున విషయం తెలిసిందే. ఆడవిలో ఆట అని ఇంటిని రెండు గ్రూపులుగా చేశారు. ఎప్పుడైనా రెండు గ్రూపులు అంటే ఇంట్లో గొడవలు జరగడం ఖాయమనే చెప్పాలి. అందరూ ఉహించిన దానికంటే ఎక్కువే జరిగాయి.
ముఖ్యంగా శ్రీహాన్- ఇనయా సుల్తానా- రేవంత్‌ల మధ్య జరిగిన గొడవ తార స్థాయికి చేరింది. గేమ్‌లో శ్రీహాన్- రేవంత్ దొంగల టీమ్‌లో ఉన్నారు. ఇనయా సుల్తానా పోలీసుల టీమ్‌లో ఉంది. గేమ్ ఆడుతున్న సమయంలో శ్రీహాన్- ఆరోహీ రావును లాగేందుకు ప్రయత్నించగా ఆమె చెట్టుకు తగిలి కిందపడిపోయి కాలికి గాయం అవుతుంది. ఆమెకు అంతక ముందే కాలికి గాయం ఉంది. మళ్లీ శ్రీహాన్ లాగడంతో అది ఎక్కువైంది. ఆ విషయంలో గొడవ జరిగిదం. వాడే లాగాడు వాడే లాగాడు అంటూ ఇనయా కామెంట్ చేస్తుంది. అందుకు శ్రీహాన్ బాగా సీరియస్ అయిపోయాడు. “వాడు ఏంటి వాడు.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరు నువ్వు అసలు వాడు అనడానికి?” అంటూ శ్రీహాన్ కోపంతో ఊగిపోయాడు. ఇంట్లోని సభ్యులు అతడిని ఆపేందుకు చాలా ట్రై చేశారు.
ఇంట్లోని సభ్యులతోపాటుగా రేవంత్ కూడా వచ్చాడు. శ్రీహాన్‌ని కంట్రోల్ చేయాల్సింది పోయి రేవంత్ కూడా ఫుల్ ఫైర్ అయిపోయాడు. దాంతో మాటలేంటి అసలు.. అదో వేస్ట్, వేస్ట్ అంటూ రెచ్చిపోయాడు. ఇంట్లోకి వెళ్తూ మళ్లీ అంటే కొట్టేస్తానంటూ ఆమె మీదకు వెళ్లాడు. అందుకు ఇనయా సీరియస్ అయ్యింది. నన్ను ఎలా అంటావ్ కొడతానంటూ అని రెచ్చిపోయింది. రేవంత్‌ని అంతా కలిసి ఇంట్లోకి లాక్కెళ్లారు. ఇప్పుడు కోపంలో మాటలు జారకు నీకే మైనస్ అవుతుంది అంటూ కూల్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, రేవంత్ ఎవరి మాట వినకుండా కోపంలో రెచ్చిపోయాడు. ఇంట్లో సంస్కారం నేర్పలేదా? ఇంతక ముందు నన్ను కూడా వాడు అన్నావ్ అంటూ ఊగిపోయాడు. కోపం చూపించడం లేదు అంతే.. కోపం అలాగే ఉంది అని వార్నింగ్ ఇచ్చాడు.
అయితే ఇప్పుడు రేవంత్ విషయంలో నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. వాడు అన్నందుకు సీరియస్ కావడం, ఆ మాటని ఖండించడం కరెక్టే.. కానీ, ఇంట్లో వాళ్లు సంస్కారం నేర్పలేదా? అని ప్రశ్నించావు. అది కూడా బాగానే ఉంది. కానీ, అమ్మాయి అదీ, ఇదీ, దాంతో, వేస్ట్, కొట్టేస్తాను అంటూ మీదకు దూకిన నీ సంస్కారం ఏమైంది? నువ్వు ఏమాత్రం సంస్కారం నేర్చుకున్నావ్? అంటూ రేవంత్‌ని ప్రశ్నిస్తున్నారు. రెండువారాల కంటే ఇప్పుడు కోపం కంట్రోల్ చేసుకుంటున్నావ్.. కానీ, ఎందుకు ఇప్పుడు ఇలా నోరు జారి మాట్లాడుతున్నావ్? అంటే నువ్వు నటిస్తున్నావా? నిజంగానే మారిపోయావా మాకు అర్థం కావడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇనయా మాట్లాడింది తప్పే.. కానీ, అంతకన్నా నువ్వు పెద్ద తప్పే చేశావ్. సంస్కారం గురించి మాట్లాడే నీ బుద్ధి ఏ గాడిదలు కాస్తోంది? అంటూ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఇనయా విషయంలో రేవంత్ చేసింది కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.