బిగ్ బాస్ కి కంటెస్టెంట్స్ సైలెంట్, చప్పుడు చేయకుండా ఉంటే నచ్చదు. ఎప్పుడూ గొడవలు పడుతుండాలి. లేదా లవ్ ట్రాక్స్ అయినా నడపాలి. అప్పుడే కదా ప్రేక్షకులు షోని చూసి ఎంజాయ్ చేసింది. ఇక ప్రస్తుత సీజన్ నే తీసుకుంటే.. మొదలై రెండు వారాలు అవుతున్నా సరే గొడవలు, పెద్ద లవ్ లాంటివి లేకపోయేసరికి టీఆర్పీ రేటింగ్ దారుణంగా వచ్చింది. దీంతో తాజాగా జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున రెచ్చిపోయారు. ఒక్కొక్కరిపై కౌంటర్స్ వేశారు. దీంతో మూడో వారం మొదలవుతూనే పూర్తిగా సీన్ మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి కెప్టెన్ టాస్క్ కోసం ‘అడవిలో ఆట’ అనే గేమ్ ని బిగ్ బాస్ పెట్టాడు. ఇందులో భాగంగా కొందరు పోలీస్ గెటప్, మరికొందరు దొంగల గెటప్స్ వేశారు. ఈ టాస్కులో ఆడుతూ ఆరోహి కిందపడిపోయి, కాలి నొప్పితో విలవిల్లాడింది. ఇకపోతే ఆరోహి కిందపడిపోవడానికి వాడే కారణమని ఇనయా, శ్రీహాన్ గురించి మాట్లాడింది. తనని వాడు వీడు అంటావా అని శ్రీహాన్ సీరియస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.
మరోవైపు ఇదే విషయమై రెచ్చిపోయిన రేవంత్ కూడా ఇనయాని టార్గెట్ చేశాడు. ‘మొన్న కూడా ఇలానే వాడు వీడు అని అన్నావ్. అప్పుడే లాగిపెట్టి…’ అని అంతెత్తున ఎగిరిపడ్డాడు. పక్కనే ఉన్న మిగతా ఇంటి సభ్యులు వారిస్తున్నా సరే ఇనయా పైపైకి వెళ్లేంతలా రేవంత్ కోపం తెచ్చుకున్నాడు. దీంతో ‘నన్నే కొడతానని ఎలా అంటావ్’ అని ఇనయా సీరియస్ అయిపోయింది. ఆ తర్వాత రేవంత్ ని హాల్ లోకి తీసుకెళ్లగా.. అక్కడి నుంచి కూడా ఇనయాపై కౌంటర్స్ వేస్తూనే ఉన్నాడు. ‘వాడేంటి వాడు.. మీ ఇంట్లో నీకు సంస్కారం నేర్పలేదా?’ అని రచ్చ రచ్చ చేశాడు. ప్రోమోలోనే ఇంత కంటెంట్ ఉందంటే.. ఇక ఫుల్ ఎపిసోడ్ లో ఇంకెంత గొడవలు ఉంటాయో. రేవంత్-ఇనయ-శ్రీహాస్ గొడవపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ లో ప్రమాదం! కుప్పకూలిన ఆరోహి!