బిగ్ బాస్ హౌసు అంటే గొడవలు, కొట్లాటలు గ్యారంటీ. ఇక ఫిజికల్ టాస్కులు అయితే కచ్చితంగా ఉంటాయి. అవి జరిగేటప్పుడు ఆడ మగ అనే తేడా లేకుండా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దానికి తోడు అన్ని చూసుకుని, చాలా జాగ్రత్తగా ఆడాలి. లేదంటే దెబ్బలు గట్టిగా తగిలే ఛాన్సుంది. ఇప్పుడు అలానే గేమ్ ఆడుతూ ఆరోహి కిందపడిపోయింది. దీంతో ప్రోమో చూసిన నెటిజన్స్ షాకయ్యారు. జరిగిన ప్రమాదం చిన్నదా పెద్దదా అని అప్పుడే మాట్లాడేసుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్ గా బాలాదిత్య, రెండోవారం కెప్టెన్ గా మోడల్ రాజశేఖర్ ఎంపికయ్యారు. మరి మూడోవారం ఎవరనేది డిసైడ్ చేసే సమయమొచ్చింది. ఇందులో భాగంగానే ఈసారి బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్ టాస్క్ ‘అడవిలో ఆట’. కొందరు పోలీస్ గెటప్పుల్లో ఉంటే.. మరికొందరు దొంగల గెటప్పులో ఉన్నారు. అత్యాశ గల వ్యాపారిగా గీతూ వ్యవహరించింది. ఈ గేమ్ లో భాగంగా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. పోలీసులను వారిని అడ్డుకుంటా ఉంటారు.
ఈ క్రమంలోనే దొంగగా చేసిన ఆరోహి, ఓ వస్తువుని తన బృందానికి అందించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఫైమా, ఇనయా తనని పట్టుకుని ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆరోహి కాలు ట్విస్ట్ అయింది. దీంతో కాలునొప్పి తాళలేక గట్టిగా అరిచింది. దీంతో దొంగగా చేస్తున్న ఆర్జే సూర్య ఆరోహిని ఎత్తుకుని తీసుకెళ్లాడు. ఫిజికల్ టాస్కులో జరిగిన ఈ ప్రమాదం చిన్నదే అయితే పర్లేదు. అది ఒకవేళ సీరియస్ అయితే మాత్రం ఆరోహి బయటకు రాకతప్పదు. మరి ఏం జరిగిందో తెలియాలంటే.. ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.
ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో బూతులతో రెచ్చిపోయిన గీతూ రాయల్!