బిగ్ బాస్ షో అనగానే ఎవరైనా గుర్తొచ్చేది గొడవలే. హౌసులో ఉన్న 21 మంది గొడవపడటం ఏమో.. అంతకంటే ముందే హోస్ట్ నాగార్జున- CPI నారాయణ, ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్స్ వేసుకోవడం, అలా అది కాస్త సైలెంట్ అయింది. ఇక మొదలైన రెండు వారాలు అవుతున్నా సరే షో చప్పగా ఉండటంతో నాగ్.. గొడవలు పడమని హౌస్ మేట్స్ హింట్ ఇచ్చాడు. దీంతో మొన్నమొన్నటి వరకు ఉన్న చిన్న చిన్న గొడవలు కాస్త.. మూడోవారం నామినేషన్స్ లో పెద్ద గొడవలు అయిపోయాయి. ఒకరిపై ఒకరు అరుచుకునేంత వరకు వెళ్లాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6వ సీజన్ తొలివారం ఎలిమినేషన్ జరగలేదు. దీంతో అందరూ రిలాక్స్ అయ్యారు. రెండోవారం కూడా దాదాపు అలానే గడిచిపోయింది. అందరూ మంచిగా మాట్లాడుకుంటా ఈ వారాన్ని కూడా గడిపేశారు. దీంతో వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యాడు. తినడానికి, చిల్ కొట్టడానికి హౌస్ లోకి వచ్చామంటే.. వాళ్లు వెళ్లిపోవచ్చని సీరియస్ అయ్యాడు. దీంతో ఇంటి సభ్యులకు విషయం అర్ధమైపోయింది. ఇప్పటికైనా సరే గేమ్ ప్రారంభించకపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించారు. నామినేషన్స్ లో రెచ్చిపోయారు.
చలాకీ చంటి, గీతూని నామినేట్ చేశాడు. పదిమందితో కలిసి ఉంటున్నప్పుడు సంస్కారంతో ఉండాలని అన్నాడు. దీనిపై అగ్గిగ్గుగిలమైనా గీతూ.. ‘మీకు సంస్కారం ఉందో లేదో చూసుకోండి’ అని గొడవపెట్టుకుంది. దీనికి గట్టిగానే బదులిచ్చిన చంటి.. అందరితో గొడవ పెట్టుకోవడం గేమ్ కాదని అన్నాడు. దానికి అదే రీతిలో బదులిచ్చిన గీతూ.. నాకు తీట లేదు అందరితో గొడవ పెట్టుకోవడానికి అని అంది. ఇక ఇనయా అయితే గీతూ… ఫెయిర్ గా ఆడట్లేదని నామినేట్ చేసింది. ఎవరేం చెబుతున్నా సరే వినకుండా విషయాన్ని సాగదీస్తుందని, తన బట్టల ర్యాక్ కూడా తీసేసుకుందని గీతూ గురించి చెప్పింది.
ఈ మొత్తం చెబుతున్నంతసేపు చాలా ఓర్పుతో ఉన్న గీతూ.. తనకు అవకాశం రాగానే ఇనయాపై విరుచుకుపడింది. ఏయ్ ఇక్కడనుంచి దొబ్బెయ్ దొబ్బెయ్ అని వెటకారంగా అంది. ఇది మొత్తం చూసిన నెటిజన్స్.. బిగ్ బాస్ హౌసులో బూతుల పంచాయతీ ఏంట్రా బాబు అని మాట్లాడుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అవి చాలా సాధారణ మాటలైనా సరే, షోలో అలాంటివి సరికాదని అంటున్నారు. మరి గీతూ అరుపులు, దానితోపాటు అంటున్న మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ‘బిగ్ బాస్ 6’ని సిల్లీ చేసేస్తున్న హౌస్ మేట్స్!