బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అన్ని సీజన్లతో పోలిస్తే బాగా వెనుకపడి పోయినట్లుగా తెలుస్తోంది. అయితే రెండోవారం వీకెండ్ నుంచి రూటు మార్చేశారు. ఇంట్లో సభ్యులను ముల్లుకర్రతో ఒక పోటు పొడిచారు. అన్ని సీజన్లతో పోలిస్తే.. హోస్ట్ నాగార్జున రెండోవారం వీకెండ్ ఎపిసోడ్లో ఎంతో సీరియస్‌గా కనిపించాడు. మొత్తం హౌస్మేట్స్ కడిగిపారేశాడు. చిల్ అవ్వడానికి వచ్చారా? గేమ్ ఆడటానికా అంటూ కేకలేశాడు. కాసేపు ఇంట్లోని సభ్యులకు ఏం అర్థం కాలేదు కూడా. అందరికీ క్లాస్ పీకిన నాగార్జున అటు కెప్టెన్ రాజ్‌కి కూడా అక్షింతలు వేశాడు. కెప్టెన్ అయ్యావ్ కంగ్రాట్స్ అంటూనే.. అసలు అదేం విజయం అంటూ ఇచ్చిపడేశాడు. పాపం రాజ్ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఇదేంటి ఇంత మాట అనేశాడు అన్నట్లుగా ఒక లుక్ ఇచ్చి నిల్చుండిపోయాడు.
మోడల్ రాజశేఖర్ మొదటివారంలో ఆడింది ఏమీ లేదని అందరికీ తెలిసిందే. హౌస్‌లోని వాళ్లు మాత్రమే కాదు.. ప్రేక్షకులు సైతం అసలు రాజ్ అనే వ్యక్తి హౌస్ లో ఉన్నాడని మాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు. వీకెండ్లో నాగార్జున సైతం థంబ్స్ డౌన్ ఇచ్చి.. ఇంకా ఇంప్రూవ్ కాలవాలని కోరాడు. అయితే రెండోవారంలో రాజ్ ఆటతీరు మార్చుకున్నాడు. అవసరం లేకపోయినా అందరితో కలవడం, మాట్లాడటం, తనకు సంబంధంలేని విషయాల్లో వేలు పెట్టడం చేసి బాగానే హైలెట్ అయ్యాడు. కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో విజయం సాధించాడు. తర్వాత కెప్టెన్ కూడా అయ్యాడు. అంతఃకరణ శుద్ధితో విధులు నిర్వర్తిస్తానంటూ మాట కూడా ఇచ్చాడు.
అయితే ఇప్పుడు రాజ్ కెప్టెన్ అయిన తీరుపై ఇంట్లోనే కాదు.. హోస్ట్ నాగార్జున నుంచి కూడా చివాట్లు తప్పలేదు. రాజ్ గురించి మాట్లాడుతూ నాగార్జున చాలా సీరియస్ అయ్యాడు. “రాజ్ కెప్టెన్ అయినందుకు కంగ్రాట్స్. కెప్టెన్ అయ్యావు సరే.. ఎలా అయ్యావ్? అందరినీ అడుక్కుని, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు సంపాదించావ్. అలా గెలవడం నీకైనా కరెక్టే అనిపిస్తోందా? నేను ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాను.. నన్ను కెప్టెన్ చేస్తే బయటకు వెళ్లినా రిగ్రెట్ ఉండదు అని అడుక్కోవడం ఏంటి? గెలుపు ఆడి గెలుచుకోవాలి, ఇలా అడుక్కుంటే వచ్చే విజయంలో కిక్కు ఉండదు” అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజ్ కెప్టెన్ కావడం, నాగార్జున క్లాస్ పీకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.