బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండువారాల తర్వాత హౌస్ మొత్తం యుద్ధవాతావరణం కనిపిస్తోంది. ఈ సీజన్ ఆదరణ తగ్గింది అనే టాక్ రావడంతో యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. మొదటివారం ఎంతో కూల్‌గా ఉన్న హోస్ట్ నాగార్జన.. రెండోవారం మాత్రం ఉగ్రరూపం చూపించాడనే చెప్పాలి. రావడంతోనే హౌస్ మేట్స్ మొత్తం మీద నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యాడు. ఇంట్లో ఉన్న వారిలో 9 మందిని పక్కకు పంపి వాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. సుదీపా, బాలాదిత్య, శ్రీసత్య, వాసంతి ఇలా చాలా మందిని హెచ్చరించారు. అయితే వారందరిలో ముఖ్యంగా రోహిత్- మెరీనాలపై నాగార్జున సీరియస్ అయ్యాడు. అసలు ఏం ఆడుతున్నారు మీరు అంటూ ప్రశ్నించాడు.
ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన రియల్ కపుల్ రోహిత్- మెరీనా. వీళ్లు హౌస్‌లో అడుగుపెట్టిన తర్వాత బిగ్ బాస్ పెద్ద షాకిచ్చాడు. అదేంటంటే ఇద్దరూ ఒక సభ్యుడి కిందే లెక్క.. ఎలిమినేట్ అయితే ఇద్దరూ ఒకేసారి వెళ్లిపోవాలి అని చెప్పాడు. మొదట్లో కాస్త డల్‌గా కనిపించిన ఈ జంట.. ఆ తర్వాత కాస్త యాక్టివ్ అయ్యారు. మెరనా ప్రతిసారి నాకు ముద్దు, హగ్గు అంటూ గోల చేయడం, వారి గొడవలకు ఇంటి సభ్యులు పంచాయితీ పెట్టడం చేశారు. ఓసారి అయితే శ్రీ సత్యతో కలిసి పెద్ద ప్రాంక్ కూడా ప్లాన్ చేశారు. మొదటివారంలో అయితే నాగార్జున చెప్పి మరీ హగ్ ఇప్పించాడు. కానీ, రెండోవారంలో అదే నాగార్జున వాళ్లపై సీరియస్ అయ్యాడు. ఆ స్థాయిలో రియాక్ట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు కూడా.
“మెరీనా- రోహిత్ మీరు అసలు హౌస్‌లో ఉన్నారా? ఏం ఆడుతున్నారు మీరు? బిగ్ బాస్ అంటే వంట వండి పెట్టడమే అనుకుంటున్నారా? మదర్ ఇండియా అనగానే ఇంక చాలులే అనుకుంటున్నావా? నాకు ముద్దు కావాలి, నాగు హగ్గు కావాలి అని నీ హక్కుల గురించి మాట్లాడుతున్నావ్. మరి.. గేమ్ విషయంలో ఎందుకు నీ భర్తని ప్రశ్నించడం లేదు. గేమ్ సరిగ్గా ఆడుతున్నారో లేదో చూసుకున్నారా? హౌస్‌లో వాళ్లంతా మీవి రెండు బుర్రలు అంటున్నారు. ఆట విషయంలో మైనస్ 2 మార్కులు అనే చెప్పాలి. ఆదిరెడ్డి ఏమో మీ ఇద్దరూ వాళ్లకి పోటీ అని నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి.. భయపడకు అంత సీన్ లేదు అక్కడ..” అంటూ నాగార్జున రోహిత్- మెరీనాలకు క్లాస్ పీకాడు. హోస్ట్ నాగార్జున వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.