బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇక నుంచి అంతకు మించి అనేలా సాగుతోంది. రెండోవారం ముగించుకుని మూడోవారంలోకి అడుగుపెట్టారు. రెండోవారంలో రాజ్ కెప్టెన్ కావడం, షానీ సాల్మన్, అభినయశ్రీలు ఎలిమినేట్ కావడం చూశాం. ఇంక మూడోవారం నామినేషన్స్ లో 9 నుంచి 11 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే హౌస్‌లో వేడి రాజుకుందనే చెప్పాలి. నామినేషన్స్ ప్రోమో చూసిన వాళ్లకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాగార్జున నొక్కి నొక్కి చెప్పాడు ఆడండి.. ఆడండి అని. అంతేకాకుండా నేను చెప్పింది గుర్తుందిగా అంటూ వెళ్లబోతూ కూడా గుర్తు చేశాడు. అంటే అది ఆడమనా? కొట్టుకోమనా? అప్పుడు అర్థంకాకపోవచ్చు కానీ, ప్రోమో చూస్తే క్లారిటీ వస్తుంది. హౌస్ మొత్తం ఇప్పటికే గ్రూపులు ఉన్నాయని తెలుసు. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువవుతాయోమో? చూడాలి.
ఇంక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ప్రేమ జంటలు, లవ్ ట్రాక్‌లు లేవే అని ప్రేక్షకులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి సీజన్లో ఒక్క జంట అయినా ఉండటం.. వాళ్లు కంటెంట్ ఇవ్వడం చూశాం. అయితే అలా ఫీలయ్యే వాళ్లకు ఆదివారం ఎపసోడ్ తర్వాత బాగా క్లారిటీ వచ్చే ఉంటుంది. ఇంట్లో రెండు జంటలు ఉన్నాయని. ఆ విషయం నేరుగా నాగార్జునానే చెప్పుకొచ్చాడు. వాళ్లు మరెవరో కాదు అర్జున్ కల్యాణ్- శ్రీ సత్య, ఆర్జే సూర్య– ఆరోహీ రావ్. అవును వీళ్లే జంటలు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీ సత్య తనకు మంచి ఫ్రెండ్ అని అంతకు మించి ఏం లేదని అర్జున్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చాడు కూడా. కానీ, ప్రేక్షకులు మాత్రం శ్రీ సత్యకు ఏం లేదు గానీ, అర్జున్ కల్యాణ్ మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతున్నాడంటూ చెప్పుకొచ్చారు.
ఇంక రెండో జంట ఆరోహీ రావ్– ఆర్జే సూర్యాల విషయానికి వస్తే. వీళ్లు కాస్త సీరియస్‌గానే ఉన్నారనిపిస్తోంది. నిజానికి ఆదివారం ఎపిసోడ్ కంటే ముందే సూర్య- ఆరోహీల మధ్య ఏందో ఉందని అంతా భావించారు. వాళ్లిద్దరు మాట్లాడుకోవడం, గిల్లిగిచ్చుకోవడం, మధ్యలో ఎమోషనల్ హగ్గులు ఇవన్నీ చూస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని భావన కచ్చితంగా కలుగుతుంది. అయితే నాగార్జున మాట్లాడుతున్నప్పుడు ఆరోహీ.. మూడేళ్లుగా కలగనిది, ఇప్పుడు ఎందుకు కలుగుతుంది అంటుంది. అయినా ఆ ముఖం చూస్తే కలగదని చెప్పింది. అయితే ఇదంతా ప్రేమతో చెప్పిన మాటలుగానే ఉన్నాయి. ఇంక లాస్ట్ లో తమన్నా ఇచ్చిన కానుక సూర్యాకు ఇవ్వకుండా అలాగే పట్టుకుంది. ఆరోహీ ఇవ్వు అంటే ఎవరి దగ్గరున్నా ఒకటేగా సార్ అంటూ నవ్వేసింది. అంటే చెప్పకనే వారి మధ్య రిలేషన్ చెప్పుకున్నారు. అంతేకాకుండా అభినయశ్రీ కూడా తేల్చేసింది. వారి మధ్య ప్రేమ ఉంది నేను చూశాను. అతను చాలా కేర్ చేస్తాడు, బుజ్జగిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆర్జే సూర్య- ఆరోహీ రావుల మధ్య నిజంగానే ప్రేమ ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.