బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. సోమవారం నామినేషన్స్ తో హౌస్ మొత్తం నానా రచ్చ జరిగింది. కుళ్లిన టమాటాలను నామినేట్ చేసేవాళ్ల నెత్తిన పిండాలంటూ బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. ఇంక వారం నుంచి మనసులో దాచుకున్న పాయింట్లు, ఎమోషన్స్ నూ ఒక్కసారిగా హౌస్మేట్స్ మాటల్లో బయటకు కక్కేశారు. ఈ నాలుగోవారం నామినేషన్స్ లో రేవంత్, గీతూ రాయల్, ఆరోహీ, సూర్య, రాజ్, శ్రీహాన్, ఇనయా, సుదీపా, అర్జున్ కల్యాణ్, కీర్తీ భట్ ఉన్నారు. ఎప్పటిలాగా కంటే ఈసారి నామినేషన్స్ లో హీట్ మరింత పెరిగింది. దాదాపుగా అంతా ఏవేవో రీజన్స్ చెప్పుకుంటూ ఎప్పుడూ చేసే వాళ్లనే నామినేట్ చేశారు. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఆరోహీ రావ్- ఫైమా మధ్య గొడవ మాత్రం వైరల్‌గా మారింది.
ఫైమా వచ్చి ఆరోహీ రావ్ ని నామినేట్ చేసింది. రీజన్స్ చెప్తూ కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో నన్ను కావాలనే టార్గెట్ చేశావ్. ఎందుకు అని అడిగితే ఒక సిల్లీ రీజన్ ఉంది అని చెప్పావ్. తర్వాత శ్రీహాన్‌ని సేవ్ చేయడానికే అలా చేశానంటూ మాట మార్చావ్ అంటూ చెప్పింది. అంతేకాకుండా రాజ్ విషయంలో అతడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావ్ అది నాకు నచ్చడం లేదంటూ చెప్పుకొచ్చింది. నిజానికి ఆరోహీ రావ్ ఎప్పుడూ కాస్త ఇరగదీసినట్లే మాట్లాడుతుంది. అంతేకాకుండా మీకు నచ్చకపోతే నాతో మాట్లాడకండి, నాకు దూరంగా ఉండండి నాకు ఫరక్ పడదూ అంటూ కామెంట్ చేస్తుంది. అడవిలో ఆట సమయంలో నువ్వు జైలుకు రాలేదు అని రాజ్ అడిగితే నేనేమీ మంచిదొంగను కాదు నేను గలీజ్ దొంగని, నేను ఎందుకు వచ్చి లొంగిపోతాను అంటూ సెటైరిక్‌గా చెప్పుకొచ్చింది.
అయితే ఆ యాక్షన్స్ కి రియాక్షన్ ఫైమా ఇచ్చి చూపింది. అయితే నామినేషన్స్ లో ఆరోహీని ఒక ఆట ఆడుకుందనే చెప్పాలి. పిరమిడ్ టాస్కులో కొట్టడం గురించే కాదు.. రాజ్‌ని ఎక్కిరిచడం, అతడిని తక్కువ చేసి మాట్లాడటం గురించి ఫైమా సీరియస్ అయ్యింది. నా ఫ్రెండ్‌ని అలా అనడం నాకు నచ్చలేదు. బ్రెయిన్ లెస్ ఎవరు అని నాగార్జున గారు అడిగితే రాజ్ పేరు చెప్పారు. కానీ, ప్రేక్షకులు దానిని యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు నాగ్ సార్ రాజ్ బ్రెయిన్ వాడుతున్నాడు అని చెబితే.. వాడుతున్నాడు కాకపోతే ఆయనిది కాదు పక్కోళ్లది అని చెప్పావంటూ ఫైమా సీరియస్ అయ్యింది. నువ్వు వచ్చినట్లే ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు అంటే ఏదో ఒకటి మాట్లాడితేనే వస్తాడు.. అంటూ గట్టిగా ఇచ్చిపడేసింది. అయితే ఫైమా ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడం హౌస్ మేట్స్ ఇప్పటివరకు చూడలేదు. ఫైమా ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చగానే అంతా చూస్తూ ఉండిపోయారు. తర్వాత రేవంత్ మాట్లాడుతూ సరిగ్గా చేశావ్ అంటూ పొగిడేశాడు.