బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు.. మొదటి రోజు నుంచీ హౌస్‌లో గొడవలు, గలాటాలతో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపారు. మొదటివారం నామినేషన్ లేదు అనేసరికి అంతా తెగ సంబరపడిపోయారు. కానీ, సోమవారం నామినేషన్స్ రావడంతో మళ్లీ గొడవలు షురూ అయ్యాయి. ఈ వారం నామినేషన్స్ లో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. గీతూ, రేవంత్, షానీ, రోహిత్-మరీనా, అభినయశ్రీ, ఫైమా, రాజశేఖర్, ఆదిరెడ్డి నామినేషన్స్ లో ఉన్నారు. నామినేషన్ సమయంలో చాలా గొడవలే జరిగాయి. ముఖ్యంగా ఈ వారం కూడా రేవంత్, గీతూ రాయల్ పైనే అంతా విమర్శలు, కంప్లైంట్ లు చేశారు. వారి గురించే గొడవలు కూడా జరిగాయి. కొత్తగా ఆదిరెడ్డి vs ఆరోహీ కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది.
అయితే మొదటివారం మొత్తం అసలు నువ్వు గేమ్ ఆడుతున్నట్లు మాకు కనిపించడం లేదంటూ విమర్శలు ఎదుర్కొన్న రాజశేఖర్ ఎట్టకేలకు గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. అదికూడా నామినేషన్స్ లో రేవంత్‌తో పెట్టుకున్నాడు. నా 5 పాయింట్లు అంటూ రేవంత్ విషయంలో తనకు నచ్చనివి చెప్పుకుంటూ వెళ్లాడు. రేవంత్ ఏమో నీతో నాకు బాండింగ్ ఉంది కాబట్టే జోక్స్ వేశానన్నాడు. అందుకు రాజశేఖర్ నాకు ఆ బాండింగ్ కనిపియ్యలేదంటూ కుండ బద్దలు కొట్టేశాడు. రాజ్ చెప్పిన కారణాలకు రేవంత్ కూడా సమాధానం చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ లేనిది నామినేషన్స్ లో చాలా వరకు రేవంత్ ఎంతో సహనంతో సమాధానం చెప్పాడు. అంతా రాజశేఖర్ ఫైర్ చూసి చప్పట్లు కొట్టారు.
అయితే ఈ నామినేషన్స్ విషయంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. అదేంటంటే ముందురోజే.. గీతూ రాయల్ రాజ్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది. అవేంటంటే.. ‘రాజ్ ఈ బిగ్ బాస్ కు పనికిరాడు. అసలు అతడ్ని ఎందుకు సెలక్ట్ చేశారో కూడా నాకు అర్థం కావడంలేదు. బిగ్‌బాస్ సభ్యుడు అంటే అందరికీ ఛాలెంజింగ్ గా ఉండాలి. అలాంటివి ఏమీ అతనిలో కనిపించడం లేదు” అంటూ గీతూ కామెంట్స్ చేసింది. మళ్లీ నామినేషన్స్ లో రాజ్ మాటతీరు చూసి మెస్మరైజ్ అయిపోయింది. ఇది కదా మాకు కావాల్సింది అంటూ చప్పట్లు కొట్టింది. అక్కడితో ఆగకుండా రాజ్‌ని చూస్తూ ఇరగదీశావంటూ సైగలు చేసింది. రాజ్‌కు నవ్వుతూ ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చింది గీతూ రాయల్. అది చూసిన హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. ప్రేక్షకులేమో అయ్యో స్వామీ.. నాయనా ఇదేం పిల్లరా బాబు. నిన్నే పనికిరాడంది. మళ్లీ ముద్దులిస్తాంది అంటూ కామెంట్ చేస్తున్నారు. గలాటా గీతూ ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.