బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అంచనాలకు మించి రాణిస్తోంది. తెలిసిన ముఖాలు లేవే అనే విమర్శలు వచ్చినా కూడా.. హౌస్‌లోని టాస్కులు, గొడవలు, విమర్శలతో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈసారి మొదటి ఎలిమినేషన్ తో అయితే ఒకింత బిగ్ బాస్‌పై విమర్శలు వచ్చాయి. నో ఎలిమినేషన్ వీక్ అయినప్పుడు ముందే చెప్పచ్చు కాదు చివర్లో ట్విస్ట్ ఇచ్చి ఇలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రెండోవారంలోకి అడుగుపెట్టిన ఈ బిగ్ బాస్ సీజన్ 6.. మరింత ఉత్కంఠగా మారబోతోందని తెలుస్తోంది. ఎందుకంటే రెండోవారం ఎలిమినేషన్స్ చూస్తే అలాగే ఉంది మరి. ఈసారి ఎలిమినేషన్స్ లో గొడవలు, కేకలు బాగానే ఉన్నాయి. మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు.
ఈవారం బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. ఈ వారం ఒక్కొక్కరు ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలి. రెండో వ్యక్తిని నామినేట్ చేసే అవకాశం లేదు. అందులో భాగంగా నామినేషన్స్ లో ఆరోహీ రావు- ఆదిరెడ్డి మధ్య గలాటా జరిగింది. ముందు ఆరోహీ రావు నామినేట్ చేసేందుకు చెప్పిన రీజన్ ను ఆదిరెడ్డి తప్పుబట్టాడు. “హౌస్‌లో ఉన్న అందరి సభ్యుల్లో నాకు మీతోనే తక్కువ రాపో ఉంది. అందుకే నామినేట్ చేస్తున్నా” అంటూ ఆరోహీ రావు ఆదిరెడ్డి ఫొటోని కుండపై అంటించి బావిలో పడేస్తుంది. ఆ తర్వాత ఆదిరెడ్డి వచ్చి ఆరోహీ రావుకు స్ట్రైట్ ప్రశ్న సంధించాడు. ఆమెను సమాధానం చెప్పాల్సిందిగా కోరాడు.
“మీరు ఇంట్లో ఉన్న వాళ్లలో గేమ్ సరిగ్గా ఆడకపోతే నామినేట్ చేస్తారా? మీతో సరిగ్గా మాట్లాడకపోతే నామినేట్ చేస్తారా?” అంటూ ఆదిరెడ్డి స్ట్రైట్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పర్ఫార్మెన్స్ బాగోకపోతేనే నామినేట్ చేస్తానంటూ సమాధానం చెబుతుంది. అంటే నేను ఈ వీక్‌లో అసలు పర్ఫామ్ చేయలేదా? మీకన్నా కూడా బాగా ఆడలేదా అంటూ ఆదిరెడ్డి కామెంట్ చేశాడు. అందుకు ఆరోహీ సీరియస్‌లీ మీరు నాకంటే ఎక్కువ పర్ఫామ్ చేశారా? అంటూ ఆశ్చర్యపోతుంది. అందుకు ఆదిరెడ్డి చూసి ఎందుకు అంత ఆశ్చర్యం.. ఏం ఇరగదీశారు మీరు? అంటూ ఆదిరెడ్డి సీరియస్ అయ్యాడు. అయితే ఆ కారణంతో ఆదిరెడ్డిని ఆరోహీ నామినేట్ చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.