బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మొదటివారంతో పోలిస్తే రెండో వారం మరింత ఉత్కంఠగా మారబోతోందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి నామినేషన్స్ నుంచే రచ్చ మొదలైంది. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ నానా రచ్చ చేస్తున్నారు. ఆరోహీ రావు- ఆదిరెడ్డిల మధ్య గట్టిగానే గొడవ జరిగింది. నాకన్నా బెటర్ పర్ఫామ్ చేస్తున్నారా అంటూ ఆరోహీ అడగ్గా.. ఏం ఇరగదీశారు మీరు అంటూ ఆదిరెడ్డి కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా శ్రీహాన్- గలాటా గీతూ మధ్య కూడా గొడవ జరిగింది. అందరు అబ్బాయిలు చెడ్డవాళ్లు అని ఎలా అంటావ్ అంటూ శ్రీహాన్ ప్రశ్నించాడు. అందుకు గీతూ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా రేవంత్- కీర్తీ భట్ మధ్య కూడా వాదన జరిగింది.
కీర్తీ భట్- రేవంత్‌ల మధ్య మొదటి వారం నుంచి ఒక చిన్న వైరం నడుస్తూ ఉంది. రేవంత్ చెప్పిన మాటల వల్లే శ్రీహాన్- కీర్తీతో సరిగ్గా మాట్లాడటం లేదంటూ కీర్తీ చెప్పిన విషయం తెలిసిందే. మొదటివారం నామినేషన్స్ లో అది బయట పడింది. అంతేకాకుండా శ్రీహాన్ కీర్తీని నామినేట్ చేయడానికి కూడా ఈ గొడవే కారణం. ఇప్పుడు రెండోవారం నామినేషన్స్ లోనూ కీర్తీ భట్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో వాళ్ల మధ్య గొడవ షురూ అయ్యింది. కీర్తీతో రేవంత్ నేను చిన్నగా మాట్లాడుతున్నాను. గట్టిగా మాట్లాడితే మళ్లీ అరుస్తున్నా అంటారు అంటూ రేవంత్ చెప్పుకొస్తుండగా.. కీర్తీ మధ్యలో మళ్లీ మాట్లాడుతుంది. అప్పుడు రేవంత్ బాగా సీరియస్ అయిపోయాడు. మాట్లాడేటప్పుడు విను అంటూ అరుస్తాడు. అందుకు కీర్తీ ఇదే నీలో ఉన్న నెగెటివ్ ఫాల్ట్ అంటూ కామెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనే దానిపై క్లారిటీ రావాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
అయితే నామినేషన్స్ విషయంలోనూ బిగ్ బాస్ ఈ సీజన్లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈసారి ఒక్కో ఇంటి సభ్యుడు ఒక్కరినే నామినేట్ చేయాలంటూ కండీషన్ పెట్టాడు. అంతేకాకుండా కెప్టెన్ బాలాదిత్యకు మాత్రం ఒక స్పెషల్ పవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతను ఒక్కడే ఇద్దరిని నేరుగా నామినేట్ చేసేందుకు అవకాశం కల్పించాడు. దాంతో బాలాదిత్య షానీని నామినేట్ చేసినట్లు చెబుతున్నారు. నిజానికి నామినేషన్స్ లోకి వచ్చే రీజన్ ఏముంది అనేది అర్థంకాని పరిస్థితి. ఎందుకంటే హౌస్‌లో షానీ అజాత శత్రువు. ఎవరినీ హర్ట్ చేయకుండా ఆడుతున్న వ్యక్తి. అయితే బాలాదిత్య నామినేషన్‌కు రీజన్ చెప్పాడో? లేక నేరుగా నామినేట్ చేశాడో క్లారిటీ లేదు. కీర్తీ- రేవంత్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.