బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం గేమ్‌లో అసలైన మజా మొదలైంది. మొదటి వారం ఎలిమినేషన్ తూచ్ దేవుడికి ఇచ్చేశాం అని తప్పించుకున్నారు. కానీ, ఈవారం మాత్రం నామినేషన్ నుంచి అసలు రచ్చ మొదలైంది. ఒకరినొకరు మాటలు అనుకుంటూ నానా యాగి చేశారు. ఇంట్లో నామినేషన్స్ తో అసలు గొడవ మొదలైంది. ఇంక టాస్కులు కూడా మొదలైతే ప్రేక్షకులకు కంటెంట్ ఓ రేంజ్లో వస్తుంది. అయితే నామినేషన్స్ లో ఈ వారం బిగ్ బాస్ కొత్త రూల్ కూడా తీసుకొచ్చాడు. ఒక సభ్యుడు ఒకరినే నామినేట్ చేయాలంటూ షరతు పెట్టాడు. దాంతో నామినేషన్స్ మరింత ఆసక్తిగా మారబోతున్నాయి. ఇప్పటికే ప్రోమో విడుదల చేసి ప్రేక్షకుల్లో ఉత్కంఠ రెకెత్తించారు. అయితే నామినేషన్స్ ప్రక్రియలో గలాటా గీతూకి శ్రీహాన్ కి వైరం జరిగింది. నిజానికి గలాటా గీతూ అంటే మొదటి రోజు నుంచి ఇంట్లోని సభ్యులు నెగెటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఆమె మనసులో ఉన్నది పైకి అనేస్తుంది. ఇంకొకటి తనకి నచ్చినట్లుగానే ఉంటుంది. అది అందరికీ నచ్చడం లేదు. ఈవారం నామినేషన్స్ లో శ్రీహాన్- గలాటా గీతూ గురించి మాట్లాడుతూ.. “నువ్వు అందరు మగాళ్లకు బుద్ధి లేదు అని మాట్లాడావు. అందరు అబ్బాయిలకు బుద్ధి లేదు అని అందరినీ అనడం నాకు నచ్చలేదు. అందరూ ఏం చేశారు?” అంటూ శ్రీహాన్ గలాటా గీతూని నామినేట్ చేశాడు. అయితే శ్రీహాన్ చెప్పిన రీజన్‌ను గలాటా గీతూ రిసీవ్ చేసుకోలేదు. అలా ఎలా చేస్తావ్ అంటూ గీతూ ప్రశ్నించింది. View this post on Instagram A post shared by Shrihan (@imshrihan) “శ్రీహాన్.. అది ఎవరు చేశారనేది నాకు కూడా తెలీదు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటే నిజంగా కుక్కకు ఒక రోజు వస్తుంది అని కాదు. అది ఒక స్టేట్మెంట్ అంతే” అంటూ గీతూ తన వాదన వినిపించింది. అంతేకాకుండా హౌస్‌లోని ఇంకా కొందరు గీతూని నామినేట్ చేశారు. నేహా చౌదరి, సుదీపా వంటి వారు గీతూనీ నామినేట్ చేశారు. ఇంకా గీతూ విషయంలో హౌస్‌లోని సభ్యుల అభిప్రాయం మారలేదనే చెప్పాలి. ఇంకా ఆమె మాట, ప్రవర్తన తమకు నచ్చడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే అలాంటి వ్యాఖ్యలను గీతూ పట్టించుకునేలా అయితే కనిపించలేదు. అంటే ఆమె ఇంట్లోని సభ్యుల కోసం తనని తాను మార్చుకునే ఉద్దేశం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. గలాటా గీతూ- శ్రీహాన్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by (@geeturoyal_) ఇదీ చదవండి: నామినేషన్స్ లో మాటల యుద్ధం.. ఆదిరెడ్డి Vs ఆరోహీ రావ్! ఇదీ చదవండి: ఎలిమినేషన్ తప్పించుకున్న అభినయశ్రీ.. బాలాదిత్య మీదకు దూకి..! ఇదీ చదవండి: బిగ్ బాస్ ‘నో ఎలిమినేషన్’ వీక్‌పై ప్రేక్షకులు ఆగ్రహం.. ‘మేం ఓ మాదిరిగా కూడా కనపడటం లేదా?’