టాలీవుడ్లో ఎప్పటి నుండో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్‌కి బింబిసార రూపంలో సాలిడ్ హిట్ దొరికింది. దీంతో నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. రికార్డు స్థాయి కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. రిలీజైన నాలుగో రోజు కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ నటనకి ఫ్యాన్స్‌తో పాటు అటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఫిదా అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలు కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. కింగ్ బింబిసార పాత్ర కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరూ చేయలేరంటూ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్‌ని ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. "బింబిసార టీమ్‌కి అభినందనలు. ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫాంటసీ సినిమా. నందమూరి కళ్యాణ్ రామ్ స్క్రీన్ ప్రెసెన్స్ ప్రభావితం చేసేలా ఉంది. కొత్త టాలెంట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ, కొత్త కథలను చేసే కళ్యాణ్ రామ్ అంటే ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మొదటి సినిమా అయినా కూడా డైరెక్టర్ వశిష్ట హ్యాండిల్ చేసిన విధానాన్ని అభినందిస్తున్నాను. ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్, నటులందరికీ అభినందనలు. బింబిసార అన్ని వయసుల వారిని అలరించే వినోదాత్మక చిత్రం" అని ట్వీట్ చేశారు. ఇక అక్కినేని నాగార్జున సైతం కళ్యాణ్ రామ్‌ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. "కళ్యాణ్ రామ్ విషయంలో చాలా సంతోషంగా ఉంది. బింబిసార బ్లాక్ బస్టర్ సినిమా టిమ్‌కి అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కళ్యాణ్ రామ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న హీరోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. I appreciate the debut dir @DirVassishta for handling it well . Commendation to all the technicians & artists . @mmkeeravaani garu @CatherineTresa1 @iamsamyuktha_ . @NTRArtsOfficial . Bimbisara : An entertainment for all age groups — Allu Arjun (@alluarjun) August 7, 2022 So very happy for @NANDAMURIKALYAN !! Congratulations to you and your team for the blockbuster #Bimbisara !! @NTRArtsOfficial — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 6, 2022 ఇది కూడా చదవండి: బింబిసార సూపర్ హిట్. కానీ.. Jr.ఎన్టీఆర్ ని ఎందుకు తిడుతున్నారు? ఇది కూడా చదవండి: Pawan Kalyan: వీడియో: ఇదీ తమిళనాడులో పవన్ క్రేజ్.. పవన్ మీద భక్తితో తమిళ తంబీలు ఏం చేశారంటే?..