పానీపూరీ.. ఇది తినే వస్తువు మాత్రమే కాదు ‘ఇట్స్ యాన్ ఎమోషన్’ అంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఈ పానీపూరీలు అంటే తెగ ఇష్టపడుతుంటారు. రోజూ అన్నం తినడం మర్చిపోయినా కూడా పానీపూరీలు తినడం మాత్రం మర్చిపోరు. నిజానికి పానీపూరీని ఇష్టపడే అబ్బాయిలు కూడా చాలా మందే ఉన్నారు. కొందరైతే వరుస పెట్టి 30 పూరీలు అయినా తినేస్తుంటారు. ఇంకొందరైతే భార్యను బతిమాలాడుకుని మరీ పానీపూరీలను ఇంట్లో చేయించుకుని తింటుంటారు. అందుకేనేమో దేశవ్యాప్తంగా ఉండే టాప్ 10 స్ట్రీట్ ఫుడ్స్ లో పానీపూరీ కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పటివరకు మనం అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు పానీపూరీలు తినడం చూశాం. కానీ, ఇప్పుడు కొత్తగా ఒక ఏనుగు పానీపూరీలకు ఫిదా అవడం నెట్టింట వైరల్‌గా మారింది.
అవును.. మీరు చదివింది నిజమే. ఒక గజరాజు పానీపూరీలకు ఫ్యాన్ అయ్యాడు. ఎంతలా అంటే మనుషుల కన్నా స్పీడుగా, ఇష్టంగా పానీపూరీలను లాగించేస్తున్నాడు. ఇది అస్సాంలోని తేజ్ పూర్‌లో జరిగింది. ఓ ఏనుగు పానీపూరీ బండి దగ్గరకు వచ్చింది. ఆ పానీపూరీ బండి యజమాని ఒక్కో పూరీని తొండానికి అందిస్తుండగా.. ఆవురావురుమంటూ లాగించేసింది. అక్కడున్న కస్టమర్లు అందరినీ కాదని యజమాని ఆ ఏనుగుకు స్పెషల్‌గా పానీపూరీ ఇచ్చాడు. అక్కడున్న జనం కడా ఎంతో ఆశ్చర్యంగా ఏనుగు పానీపూరీ తినడాన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ గజరాజు ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసపెట్టి పూరీల మీద పూరీలు లాగించేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Everyone loves #PaniPuri 😅 pic.twitter.com/Ygz3V60CgH
— Dipanshu Kabra (@ipskabra) October 12, 2022