నిత్యం మన చుట్టు జరిగే వింతలు, విశేషాలను చాలామంది సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. పోస్ట్ చేసిన వెంటనే అవి క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. అచ్చం ఇలాగే ఓ విద్యార్థి రాసిన 10 ప్రశ్నల జవాబు పత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ విద్యార్థి రాసిన ఆ జవాబు పత్రాన్ని చూసిన నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుతున్నారు. విషయం ఏంటంటే? సోషల్ స్టడీస్ పరీక్షలో భాగంగా పెళ్లి అంటే ఏమిటీ? అనే 10 మార్కుల ప్రశ్నకు ఓ విద్యార్థి భిన్నంగా సమాధానాలు రాశాడు. దీనిని చదివిన నెటిజన్స్ నవ్వును ఆపుకోలేకపోతున్నారు.
పెళ్లంటే.. మేము నీకు ఇక ఇంట్లో తిండి పెట్టలేమని, నీకు తిండి పెట్టే వాడిని వెతుక్కోమని తల్లిదండ్రులు చెప్పినప్పుడు పెళ్లి జరిగింది. ఇక ఒక అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు నువ్వు పెద్దదానివి అయ్యావు అని చెప్పినప్పుడు పెళ్లి జరిగుతుంది. యువతి, యువకుడి తల్లిదండ్రులు మీరు పెద్దవాళ్లు అయ్యారు అని చెప్పినప్పుడు యువతి, యువకుడు కలుసుకుని పెళ్లి చేసుకుంటారంటూ ఆ విద్యార్థి 10 మార్కుల ప్రశ్నకు ఇలా జవాబు రాశాడు. ఈ విద్యార్థి రాసిన ఈ జవాబు పత్రాన్ని చదివిన ఆ టీచర్.. నాన్ సెన్స్ అంటూ 10కి సున్నా మార్కులు వేసింది. ఇదే ఫొటోను ఓ యువకుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ఫొటో కాస్త వైరల్ గా మారుతోంది. ఆ బాలుడు రాసిన పెళ్లి అంటే ఏమిటి? అనే సమాధానాన్ని చదివిన నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P
— Velu (@srpdaa) October 11, 2022