శ్మాశానాలకు సంబంధించి ఇప్పటివరకు చాలా వార్తలు విని ఉంటారు, చాలా వార్తలు చూసుంటారు. కానీ, ఈ వార్త మాత్రం చాలా ప్రత్యేకం. కేవలం ప్రత్యేకం మాత్రమే కాదు.. భయానకం కూడా. శ్మశానంలో క్షుద్రపూజలు, శవాలు మాయం, సమాధుల కూల్చివేత ఇలాంటి వార్తలే ఇప్పటివరకు విని ఉంటారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే వార్తను ఇప్పటివరకు ఎప్పుడూ విని ఉండరు. అదేంటంటే.. శ్మశానంలోని శవాలు మాయమవుతున్నాయి. అయితే వాటిని ఎవరూ దొంగిలించడం లేదు, ఎవరూ సమాధులు పగలగొట్టడం లేదు. కొన్ని పాములు సమాధుల్లో దూరి అందులో ఉండే శవాలను ఆరగించేస్తున్నాయి. అవును మీరు చదివింది నిజమే. అదికూడా ఎక్కడో మారు మూల పల్లెలో కాదు ఇది జరిగింది. హైదరాబాద్‌లోని పాత బస్తీలోనే ఈ విషయం జరిగింది.
పాములు.. కొందరికి ఈ పేరు వినగానే ఒళ్లు గగుర్‌పొడుస్తుంటుంది. ఇంకొదరైతే వాటి వీడియోలు, ఫొటోలు చూసినా కూడా భయంతో వణికిపోతారు. అలాగే శ్మశానం అనే పదం విన్నా కూడా కొందరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు చెప్పుకోబోయే వార్త ఆ రెండింటికి సంబంధించినదే. హైదరాబాద్ పాతబస్తీలోని ఓ శ్మశానంలో సమాధుల్లో శవాలు మాయం అవుతున్నాయి. అయితే వాటిని ఎవరైనా దొంగిలిస్తున్నారు అనుకుంటే పొరపాటే వాటిని కొన్ని విష సర్పాలు, కొండచివలు ఆరగిస్తున్నాయి. శ్మశానంలోని సమాధుల్లో దూరి అక్కడున్న శవాలను మింగేస్తున్నాయి. అతేకాకుండా ఒక సమాధి నుంచి మరో సమాధిలోకి కూడా దూరి శవాలను ఆరగించేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు శ్మశానంలోకి అడుగుపెట్టాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
పగటిపూట కూడా శ్మశానం వైపు వెళ్లాలంటే భయంగా ఉంటోందంటూ స్థానికులు చెబుతున్నారు. శ్మశానం నిండా విష సర్పాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆ శ్మశానం జనావాసల మధ్య ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త మాత్రమే కాదు.. పాతబస్తీలోని శ్మశానవాటికల్లో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు అని వస్తున్న వార్తలు కూడా స్థానికులను తీవ్ర కలకలానికి గురి చేస్తున్నాయి. దేశంలో ఎక్కడా ఇలాంటి వార్త వెలుగు చూడలేదు. కొండచిలువ ఒక సమాధిలోకి దూరి శవాన్ని మింగేస్తోంది అనే వార్త కేవలం పాతబస్తీలోనే కాదు.. భాగ్యనగరం మొత్తం కలకలం రేపుతోంది.