ఓటీటీ ప్లాట్‌ఫామ్.. నిజానికి ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా కరోనా తర్వాతే అందరికీ తెలిసింది. కరోనా లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతబడ్డాయి. వినోదం కోసం అంతా స్మార్ట్ ఫోన్ల మీద ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఈ ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. అయితే నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీలు గతంలోనూ ఉన్నాకూడా అలాంటి వాటికన్నా కూడా తక్కువ ప్లాన్లతో ఎన్నో ఓటీటీలు వచ్చాయి. పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సైతం తక్కువ ధరతో నెలవారీ ప్లాన్‌లను కూడా తీసుకొస్తోంది. అయితే మన దగ్గర ఉన్నట్లుగానే విదేశాల్లోనూ అదే పరిస్థితి కనపిస్తోంది. ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది.
నిజానికి నెట్‌ఫ్లిక్స్ కి గతంలో ఉన్న సబ్‌స్క్రైబర్స్ క్రమంగా తగ్గుతూ వచ్చారు. అయితే పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని నెట్‌ఫ్లిక్స్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా బేసిక్ ప్లాన్ కాకుండా యాడ్ సపోర్టెడ్ ప్లాన్ అంటూ పరిచయం చేసింది. అంటే ఈ ప్లాన్ తీసుకున్న వారికి నెట్‌ఫ్లిక్స్ నింబంధనలను బట్టి యాడ్స్ వస్తాయి. ఈ యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌ని నవంబర్ 3న అమెరికాలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, కొరియా, మెక్సికో, స్పెయిన్ ఇలా వరుసగా విడుదల చేయనున్నారు. విదేశాల్లో తమ సబ్‌స్క్రైబర్లను పదిలం చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ యాడ్ సపోర్టెడ్ ప్లాన్ అంటే ఏంటి? ఈ ప్లాన్‌లో మీరు ఒకసారి ఒకే డివైజ్‌లో కంటెంట్ చూడచ్చు. అది కూడా 480p క్వాలిటీతో మొబైల్‌లో మాత్రమే చూడాలి. ఫైర్‌స్టిక్, టీవీ, కాస్టింగ్ ఇలా ఏం చేయలేరు. ఈ యాడ్ సపోర్టెడ్‌లో గంటకు 4 నుంచి 5 నిమిషాల యాడ్స్ వస్తాయి. అవి కూడా 15 నుంచి 30 సెకన్ల నిడివిలో ఉంటాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ కు సంబంధించిన ఏ ప్లాన్ తీసుకున్నా కూడా భారత్ మార్కెట్‌ని టార్గెట్ చేసినట్లు ఉంటుంది. ఎందుకంటే అమెరికా కంటేనే ఎప్పుడూ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్లు ఇండియాలో తక్కువ ధరకు అందిస్తుంటిది. యాడ్ సపోర్టెడ్ ప్లాన్ ఇండియాలో కేవలం రూ.149కే అందుబాటులో ఉండగా.. ఆ ప్లాన్‌ని అమెరికాలో అయితే 3 డాలర్లుగా నిర్ణయించారు. బేసిక్ ప్లాన్ మనకు రూ.199 ఉండగా.. అమెరికాలో బేసిక్ ప్లాన్ 9.9 డాలర్లుగా ఉంది. ఈ యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌తోనైనా నెట్‌ఫ్లిక్స్ దశ తిరుగుతుందేమో చూడాలి.
Netflix announced it’s ad supported plan in 12 countries, will rollout from November 2022.
~ As the name of the plan suggest, it will contain ads while watching your favourite shows.
~ The company will show an average of about 4-5mins of ads per hour.
👇 pic.twitter.com/KtV29JwkT1— Himanshu Ramteke (@defrag_18) October 14, 2022