రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించిన నెట్‌వర్క్ ఇది. వచ్చిన ఏడాదిలోపే తమ ఆఫర్లు, ఆకర్షణీయమైన టారిఫ్ ప్లాన్లతో దేశవ్యాప్తంగా కోట్లలో వినియోగదారులను సొంతం చేసుకుంది. అతి తక్కువ ధరల్లో డేటా ప్లాన్లు తీసుకొచ్చి అందరినీ మెప్పించింది. పెరుగుతున్న పోటీతో జియో సైతం తమ టారిఫ్‌లు, ప్లాన్లను మార్చుకుంటూ పోయిన విషయం తెలిసిందే. 100 ఎంబీని రోజంతా వాడుకునే వినియోగదారులతో రోజుకు 1 జీబీ డేటా వాడేలా చేసింది. ఇప్పుడు మాత్రం జియో కూడా అందరిలాగానే ప్లాన్లు తీసుకొస్తోంది. అయితే ఇటీవలి కాలంలో జియో కొన్ని ప్లాన్లకు మార్పులు కూడా చేసింది. ఆ మార్పులు వినియోగదారులకు గట్టి షాకే ఇస్తున్నాయి.
విషయం ఏంటంటే.. గతంలో జియో రీఛార్జ్ చేసుకుంటే మీకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా వచ్చేది. ఇకనుంచి ఆ అవకాశం లేదనే తెలుస్తోంది. ఎందుకంటే జియో రీఛార్జ్ ప్లాన్లలో టారిఫ్‌లకు సంబందించిన వివరాల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అనే ఆప్షన్ గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. ఒకప్పుడు ఎంతోగొప్పగా రీఛార్జ్ తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ అంటూ ఊదర కొట్టి టెలికాం దిగ్గజం ఇప్పుడు మాత్రం గుట్టుచప్పుడు కూకుండా తమ టారిఫ్‌లలో నుంచి కొన్ని సదుపాయాలు, ఆఫర్లను తొలగించడంపై వినియోగాదారులు సైతం గుర్రుగా ఉన్నారు. ప్లాన్ల గురించి ఎలా అయితే ప్రచారాలు చేసుకుంటారో అలా టారిఫ్‌లో చేసిన మార్పుల గురించి కూడా చెప్పాలి కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడున్న ప్లాన్ల ప్రకారం మీకు రీఛార్జ్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కావాలి అంటే మిగిలింది రెండో రెండు ప్లాన్లు. అవి ఒకటి రూ.1,499 టారిఫ్ ప్లాన్. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉటుంది. రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ వస్తుంది. ఈ రీఛార్జ్ తో మీకు ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంక రెండో ప్లాన్.. రూ.4,199 అనమాట. ఈ ప్లాన్ 365రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తీసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజూ 100 మెసేజ్‌లు, ఏడాది పాటు ఉచింతగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ప్రస్తుతం మాత్రం జియో నుంచి ఈ రెండు ప్లాన్లకు మాత్రమే ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇచ్చాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్ చూడాలంటే అయితే ఈ రీఛార్జ్‌లు చేసుకోవాలి.. లేదంటే డిస్నీ ప్లస్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే మరి.