పబ్ జీ గేమ్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ గేమ్ వల్ల ఎంతో మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ గేమ్ ని బ్యాన్ చేయాలంటూ ఎంతోమంది తల్లిదండ్రులు డిమాండ్లు కూడా చేశారు. తర్వాత పబ్ జీ గేమ్ బ్యాన్ అవ్వడం, దాని స్థానంలో ఇండియాలో బీజీఎంఐ గేమ్ లాంఛ్ కావడం జరిగింది. తర్వాత గతేడాది బీజీఎంఐ గేమ్ ని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.
పబ్ జీ.. ఈ గేమ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ గేమ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘటనలు అలాంటివి మరి. ఈ పబ్ జీ గేమ్ వల్ల ఎంతో పిల్లలు మానసిక రుగ్మతలకు గురయ్యారు. చాలా మంది హత్యలు చేసి జైలు పాలయ్యారు. ఇంకొందరు తోబుట్టువులను, తల్లిదండ్రులను కోల్పోయారు. భారత్ లో కూడా ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. పబ్ జీ గేమ్ వల్ల లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే గతేడాది బీజీఎంఐ గేమ్ ని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పబ్ జీ లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే బీజీఎంఐ భారత్ కి తిరిగి రాబోతోందని చెబుతున్నారు.
పబ్ జీ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో అందరికీ తెలుసు. ఆ గేమ్ వల్ల కొన్ని నష్టాలు కూడా జరిగాయి. అయితే భద్రతా కారణాల రీత్యా పబ్ జీ గేమ్ ని భారత్ లో బ్యాన్ చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(బీజీఎంఐ) పేరిట మరోసారి భారత్ లో గేమ్ ని లాంఛ్ చేసింది. పాత్ గేమ్ కంటే దీనికి తక్కువ గుర్తింపు లభించింది. అయితే గతేడాది జులై నెలలో మరోసారి బీజీఎంఐ గేమ్ ని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్లే స్టోర్ నుంచి కూడా ఆ గేమ్ ని తొలగించారు. హోమ్ మినిస్ట్రీ సూచన మేరకు ఐటీ యాక్ట్ 2000, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2009 ప్రకారం బ్యాన్ చేసినట్లు ఓ ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
ఇప్పుడు పబ్ జీ లవర్స్ కి శుభవార్త అందేలా ఉంది. న్యూస్ 18 రిపోర్ట్స్ ప్రకారం త్వరలోనే బీజీఎంఐ గేమ్ తిరిగి ఇండియాలో అడుగుపెట్టబోతోందని చెబుతున్నారు. ఎందుకంటే బీజీఎంఐ కంపెనీ భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఒక మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో బీజీఎంఐ కంపెనీకి మరిన్ని సూచనలు చేసినట్లు చెబుతున్నారు. 18 ఏళ్లలోపు పిల్లలకు కచ్చితంగా గేమ్ లో టైమ్ బ్రేక్ ఇవ్వాలని, రక్తం కనిపించకుండా చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెలల్లో బీజీఎంఐ తిరిగి ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే దీని మీద ఎలాంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. బీజీఎంఐ గేమ్ పై బ్యాన్ ఎత్తేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.