5జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు, ఈ సేవల గురించి బాగా వినిపిస్తోంది. అయితే ఇప్పటికే దేశంలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయని చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక్కసారిగా వారి ఫోన్లో 5జీ సేవలు చూసి అవాక్కవుతున్నారు. అయితే భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే 5 సేవలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మొదటి ఫేజ్‌లో 8 నగరాల్లో తమ 5జీ సేవలు ప్రారంభించింది. అవి.. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసిలో ఎయిర్టెల్ 5జీ సేవలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అయితే 5జీ కోసం ఇంకా ఏ ప్లాన్ తీసుకోవాలి? ఎంత ఛార్జ్ చేస్తారు? అంటూ వివరాల కోసం వెతుకులాట మొదలు పెట్టారు. అయితే అసలు 5జీలో ఎంత స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది? ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా 5జీ సేవల కోసం టెలికాం వినియోగదారులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్నారు. అయితే అందరికంటే ఎయిర్టెల్ ఒకడుగు ముందుగా తమ వినియోగదారులకు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి పోటీ ప్రపంచంలో ఎయిర్‌టెల్‌కి ఇది బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అయితే ఎయిర్టెల్ 5జీ సర్వీసెస్ కోసం ప్రత్యేకంగా మళ్లీ సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మీ వద్ద సిమ్‌తోనే 5జీ సేవలను పొందవచ్చు. అంతేకాకుండా 5జీ సపోర్ట్ చేసే అన్ని మొబైల్స్ లో 5జీ సేవలను పొందవచ్చు. మీ నగరంలో ఎయిర్టెల్ 5జీ సిగ్నల్స్ వస్తే వెంటనే మీ ప్రిఫర్డ్ నెట్వర్క్ ని 5జీలోకి మార్చుకోవచ్చు.
మీ మొబైల్లో 5జీకి మార్చుకున్నాక ఎక్కువ డేటా అయిపోతుందని భావిస్తే.. మీరు వెంటనే నెట్వర్క్ ని 4జీలోకి మార్చుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 5జీ నెట్వర్క్ స్పీడ్ 600 ఎంబీపీఎస్ వరకు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం 5జీ మోడల్స్ అయిన యాపిల్, శాంసంగ్, షావోమీ, వివో, వన్ ప్లస్, రియల్మీలో 5జీ సేవలను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా శాంసంగ్ ఫోల్డ్ సిరీస్, గాలెక్సీ S22, శాంసంగ్ ఎం32, ఐఫోన్ 12 ఫోన్లలోనూ 5జీ సేవలను పొందవచ్చు. ఇంక జియో 5జీ సేవల విషయానికి వస్తే.. ట్రైల్ సమయంలో అన్లిమిటెడ్ 5జీ డేటాని అందించనున్నట్లు తెలుస్తోంది. జియో 5జీ సేవలను డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే జియో 5జీ టారిఫ్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం మాత్రం ఇంకా ప్రకటించలేదు.
#5G 🇮🇳
• JioTrue 5G all Over India by December 2023
•Airtel 5G Launched in 8 Cities 🏙️
Delhi
Mumbai
Bengaluru
Varanasi
Gurugram
Hyderabad
Chennai
Kolkata
🔵Pan India Rollout by March 2024•Vi 5G Coming Soon..
•BSNL Will Provide 5G Services Next Year (Independence Day) pic.twitter.com/wvnZHJ9fBp
— Ankit (@TechnoAnkit1) October 1, 2022