బీఎస్ఎన్ఎల్ సంస్థ గత కొంతకాలంగా పెరుగుతున్న పోటీని అధిగమించేందుకు ఎంతో కృషి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. ప్రైవేటు కంపెనీలకు పోటీగా వివిధ ఆఫర్లను తీసుకొస్తోంది. డేటా, టారిఫ్‌ల విషయంలో చాలా కంపెనీలతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ అతి తక్కువ ధరలకే ప్లాన్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పుడు బ్రాడ్‌బాండ్‌పై కూడా కన్నేసింది. ఇప్పటికే వైఫై విషయంలో ప్రైవేటు కంపెనీల నుంచి ఎంతో పోటీ ఉంది. దానిని అధిగమించేందుకు బీఎస్‌ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్ వేసింది. కనెక్షన్ తీసుకున్న వారికి ఫ్రీగా రూటర్ అందిస్తామంటూ ప్రకటించింది. అంతేకాకుండా ఎలాంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జెస్ కూడా ఉండవని ప్రకటించింది. ఈ ఆఫర్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌కు తప్పకుండా వనియోగదారులు పెరుగుతారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అసలు ఆ వివరాలు ఏంటంటే.. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.599, రూ.799, రూ.999, రూ.1,499 ధరలలో కొన్ని ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లలో ఏదైనా సరే ఆరునెలలకు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీకు బీఎస్‌ఎన్‌ఎల్ సింగిల్ బ్యాంట్ ఓఎన్‌టీ రూటర్‌ని ఉచితంగా అందిస్తోంది. ఈ రూటర్‌ని మీరు బయట మార్కెట్‌లో కొనుగోలు చేయాలి అంటే దాదాపు రూ.699 నుంతి వెయ్యి, రూ.1500 వరకు ధర పలుకుతున్నాయి. కానీ, మీరు ఆరు నెలలపాటు ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మీకు ఉచితంగా సింగిల్ బ్యాండ్ వైఫై రూటర్‌ని అందిస్తున్నారు. అంతేకాకుండా.. కనెక్షన్ తీసుకునే సమయంలో మీ వద్ద నుంచి ఇన్‌స్టాలేషన్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయరు.
అంతేకాకుండా ఈ రూ.599, రూ.799, ఈ రూ.999, రూ.1,499 ప్లాన్స్ ని ఏడాది కాలానికి ఒకేసారి కొనుగోలు చేస్తే మీకు డబుల్ బ్యాండ్ వైఫై రూటర్‌ని ఉచితంగా అందిస్తారు. ఎలాంటి ఇన్‌స్టాలేషన్, సేఫ్టీ డిపాజిట్ లేకుండానే ఉచితంగా వైఫై రూటర్‌ని అందిస్తున్నారు. ఇంక ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే.. రూ.599 ప్లాన్‌లో నెలకు 60 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3,300 జీబీల డేటా పొందవచ్చు. నెలలో డేటా అయిపోతే తర్వాత 2ఎంబీపీఎస్ వేగంతో డేటా వాడుకోవచ్చు. రూ.799 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్, 3,300 జీబీ డేటా లభిస్తుంది. అదే రూ.999 ప్లాన్‌లో అయితే 150 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3,300 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఇంక, రూ.1,499 ప్లాన్ తీసుకుంటే 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 3,300 జీబీ డేటాను వాడుకోవచ్చు. ఒకవేళ డేటా అయితే తర్వాత 15 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా వస్తుంది. అంతేకాకుండా.. రూ.999, రూ.1,499 ప్లాన్స్ తీసుకోవడం ద్వారా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, హంగామా వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే బీఎస్‌ఎన్‌ఎల్ తిరిగి పూర్వ వైభవాన్ని త్వరలోనే పొందవచ్చు.