‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి‘ అనే సామెత తెలిసే ఉంటుంది. అసలు ఊహించడానికి కూడా అవకాశం లేనివి చూసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. అలాంటి ఊహించని ఘటన టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీకి ఎదురైంది. అది కూడా టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తినే తిండి విషయంలో. అతను తినేది చూశాక.. ఇలాంటి టేస్టులు ఉన్న వ్యక్తులు కూడా భూమిపై ఉన్నారా అనిపించిందట కోహ్లీకి. అంత భయంకరమైన సాహా అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
భూమిపై ఉన్న ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. ఇది మనందరకి తెలిసు. అలాగని.. ఐస్‌క్రీమ్‌లో గులాబ్ జామున్ వేసుకుని తినేవాళ్లు చూశాం.. కానీ, ఐస్‌క్రీమ్‌లో పప్పు వేసుకుని తినేవాళ్లు ఉన్నారా? ఉన్నాడు.. వన్ అండ్ ఓన్లీ వృద్ధిమాన్ సాహా. అంతేకాదు.. ఒక్కోసారి నోట్లో అన్నం పెట్టుకొని మరీ ఐస్‌క్రీమ్ తింటాడట. సాహాకు ఉన్న ఇలాంటి ఎన్నో భయంకరమైన అలవాట్ల గురుంచి కోహ్లీ బయటపెట్టాడు. “తినేటప్పుడు వింత వింత కాంబినేషన్లు ట్రై చేయాలంటే వృద్ధిమాన్ సాహా వల్లే అవుతుంది. అంతేకాదు అతను తినే విధానం కూడా వింతగా ఉంటుంది. ఒక్కోసారి అతని ప్లేట్‌లో బటర్ చికెన్, రోటీ, సలాడ్‌తో పాటు రసగుల్లా కూడా ఉంటుంది. రెండు ముక్కలు రోటీ, సలాడ్ కొరికి మధ్యలో రసగుల్లాని నోట్లో వేసుకుంటాడు. అబ్బా.. అతను తినే విధానం చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంది”.
“If I’ve seen anyone try unique combination while eating then it is Wriddhiman Saha. I once noticed his plate, which had butter chicken, roti, salad and there was a rasgulla kept as well,” @imVkohli said.https://t.co/6D3CVtSoG4
— Circle of Cricket (@circleofcricket) October 6, 2022
అంతేనా ఓసారి ఓసారి ఐస్‌క్రీమ్‌లో దాల్ ఛావల్ వేసుకుని తింటున్నాడు. ఇలాంటివి చూడలేక ‘వృద్ధీ ఏం చేస్తున్నావ్’ అని అడిగా. దానికి అతను నేను ఇలాగే తింటానని చెప్పాడు. ఆ తినడం చూశాక నా దిమ్మతిరిగిపోయింది. ఈ క్రియేటివిటీని ఆటలో చూపిస్తే బాగుంటుంది కదా అని అపుడప్పుడు అనుకుంటూ ఉంటా..” అని సాహా భయంకరమైన అలవాట్ల గురుంచి కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా, కోహ్లీ కెప్టెన్సీలో టెస్టుల్లో సాహా ఎక్కువ మ్యాచుల్లోనే వికెట్ కీపర్‌గా కనిపించేవాడు. ఎప్పుడైతే.. హిట్ మ్యాన్ పగ్గాలు చేపట్టాడో.. ఆనాటి నుంచి కనుమరుగైపోయాడు.