సౌరవ్ గంగూలీ.. ఫిక్సింగ్ భూతం పట్టి.. ఆట అటకెక్కి.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఇండియన్ క్రికెట్‌కు కెప్టెన్‌గా ఊపిరిపోశాడు. స్వదేశంలో సింహం లాంటి టీమిండియాకు విదేశాల్లోనూ గర్జించడం నేర్పించాడు. ఆటగాడిగా సచిన్‌కే పోటీ ఇస్తూ.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. ఎంతో మంది యువ క్రికెటర్లకు ప్రోత్సాహం అందించి స్టార్లను చేశాడు. ఇంత చేసినా.. అవమానకరంగా కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానం కోల్పోయాలే చేశారు. అయినా పట్టువదలకుండా.. మళ్లీ టీమ్‌లోకి వచ్చి సత్తా చాటాడు. ఆ తర్వాత ఆటకు వీడ్కోలు పలికి.. అధ్యక్షుడిగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ను విజయపథంలో నడిపి.. భారత క్రికెట్ బోర్డుకు ప్రెసిడెంట్ అయ్యాడు. తన హయంలో దేశవాళీ క్రికెట్‌కు మహర్దశ తెచ్చాడు. కరోనా కష్టలోనూ ఐపీఎల్‌ను నిర్వహించాడు. బోర్డు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు.. కానీ.. మళ్లీ అదే అవమానం. అప్పుడు కెప్టెన్సీ.. ఇప్పుడు అధ్యక్ష పదవి.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ)కు మరో ఆరు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షపదవితో పాటు మరో 4 రకాల పదవులకు వ్యక్తులను ఎన్నుకొనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి రెండో సారి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉండకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో 1983 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు రోజర్ బిన్నీ కొత్త అధ్యక్షుడు కాబోతున్నాడంటూ సమాచారం అందుతోంది. సరే.. ఒకరి తర్వాత మరొకరు ఆ పదవి చేపడితే తప్పులేదు కానీ.. సౌరవ్ గంగూలీ చుట్టూ ఒక స్కెట్ వేసి.. కావాలనే అతని పరువుకు నష్టకలిగిస్తూ.. అవమానకర రితీలో తప్పిస్తున్నారనే విషయం క్రీడాభిమనుల్లో ఆందోళన కలిగిస్తుంది.
జైషాకు లేని ఇబ్బంది గంగూలీకే వచ్చిందా..
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో దఫా కొనసాగే సంస్కృతి లేదని, గంగూలీ అధ్యక్షుడిగా విఫలం అయ్యాడంటూ కుంటి సాకులు చెబుతూ.. బోర్డు పెద్దలంతా దాదాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ తన మూడేళ్ల హయంలో బీసీసీఐని సమర్థంగానే నడిపించాడనే వాదన వినిపిస్తుంది. అలాగే దేశవాళీ క్రికెట్‌కు గంగూలీ హయంలో జరిగినంత మంచి ఎన్నడూ జరగలేదన్నది ఎవరూ కాదనలేని నిజం. అలాగే కరోనా కష్టకలంలో ఐపీఎల్‌ను నిర్వహించి.. బోర్డుకు కోట్లు కూడబెట్టాడు. అయినా కూడా గంగూలీపై విఫలం అయ్యాడంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అంటూ దాదా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నెల 18న జరగనున్న ఎన్నికలకు 11, 12 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జైషా రెండో సారి కార్యదర్శిగా కొనసాగేందుకు ఆ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మరి జైషా రెండో దఫా పదవి చేపడితే లేని ఇబ్బంది.. గంగూలీ చేపడితేనే వస్తుందా? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ పెద్దలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఐపీఎల్ చైర్మన్ పదవి..
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి కొనసాగకుండా గంగూలీకి అడ్డుపడుతున్న బీసీసీఐలోని పెద్ద తలలు.. గంగూలీకి మరో ఆఫర్‌ను ఇచ్చాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా తప్పుకుని.. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా కొనసాగాలని సూచినట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి.. ఆ బోర్డుకు సబ్ బాడీగా పనిచేసే కౌన్సిల్‌కు చీఫ్ ఉంటాడా? కచ్చితంగా ఉండడు. అందులోనూ గంగూలీ లాంటి ముక్కుసూటి మనిషి అయితే కచ్చితంగా ఉండడు. ఈ విషయం తెలిసిన జైషా కనుసన్నల్లో పనిచేసే బీసీసీఐ పెద్దలు.. కావాలనే గంగూలీని అవమానించాలని ఈ ప్రపోజల్ తెచ్చినట్లు దాదా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆఫర్‌ను గంగూలీ సైతం తిరస్కరించినట్లు సమాచారం.
బీజేపీ కుట్రలో భాగమేనా..?
ఆటగాడిగా, కెప్టెన్‌గా, అధ్యక్షుడిగా ఇండియన్ క్రికెట్‌కు ఎంతో చేసిన గంగూలీని ఒక కుట్ర ప్రకారమే బీసీసీఐ నుంచి బయటికి పంపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీని వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు, ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి జైషాతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాకముందు అయిన తర్వాత కూడా ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ఈ విషయంపై గంగూలీ ఏ సందర్భంలోనూ స్పందించలేదు. అయినా కూడా బీజేపీ.. గంగూలీపై పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తుంది. గంగూలీని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బెంగాల్‌లో మమత బెనర్జీ పార్టీ తృణముల్ కాంగ్రెస్‌ను ఢీకొట్టవచ్చనేది బీజేపీ ప్లాన్‌గా వార్తలు వచ్చాయి.
అసలు విషయం చెప్పకుండానే గంగూలీని 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా చేసి.. రెండో దఫా కూడా అవకాశం ఇస్తామని మాట ఇచ్చినట్లు సమాచారం. కానీ.. గంగూలీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ బీజేపీ ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించడంపై బీజేపీ గుస్సా అయినట్లు తెలుస్తుంది. అందుకే గంగూలీని బీసీసీఐ అధ్యక్షపదవి నుంచి తప్పంచడమే కాకుండా.. అధ్యక్షుడిగా అతను విఫలం అయ్యాడనే విష ప్రచారం కూడా చేయించే కుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గంగూలీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో ఈ విషయం తీవ్ర స్థాయిలో రగడ రాజేసుకుంది. టీఎంసీ పార్టీ నేతలు గంగూలీని అధ్యక్షుడిగా కావాలనే తప్పిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
The BCCI won’t support Sourav Ganguly for the post of ICC Chairman even if Ganguly desires to move to the ICC. (Reported by Indian Express).
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2022
It’s the end of Sourav Ganguly era as the BCCI president – he got no backing from the BCCI to continue for his 2nd term.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2022
Sourav Ganguly was offered the post of IPL Chairman, but he wanted to continue as BCCI President so he’s basically sacked ! 😭😭🔥
KARMA never loses an address !🛐🤲 pic.twitter.com/zcu25gnPIz
— 𝐒𝐚𝐮𝐫𝐚𝐛𝐡 𝐓𝐫𝐢𝐩𝐚𝐭𝐡𝐢 (@SaurabhTripathS) October 11, 2022
Sourav Ganguly Didn’t Join BJP, So No BCCI 2nd Term, Alleges Trinamool https://t.co/PCfqlsRuYf pic.twitter.com/UONg7RnZsp
— NDTV News feed (@ndtvfeed) October 11, 2022