టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రైట్ టైమ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ఇటివల ముగిసిన ఆసియా కప్ 2022తో కోహ్లీ తన మునుపటి రిథమ్‌ను అందుకున్నాడు. అంతకంటే ముందు వరకు పరుగులు చేస్తున్నా.. అవి అతని స్థాయి తగ్గట్లు లేవంటూ విమర్శలు వినిపించాయి. అలాగే సెంచరీ చేయక కూడా మూడేళ్లపైనే అవ్వడంతో కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ తర్వాత ఏకంగా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. టీమిండియా ఆసియా కప్ సూపర్ ఫోర్ దశతోనే సరిపెట్టుకున్నా.. కోహ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడంతో ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. హాంకాంగ్, పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీలతో టచ్‌లోకి వచ్చిన కోహ్లీ.. అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. చాలా కాలంగా వేధిస్తున్న సెంచరీ కరువును కూడా తీర్చుకున్నాడు.
ఆసియా కప్ కంటే ముందు కోహ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకున్న వారు సంతోషం వ్యక్తం చేశారు. పాక్ ఆటగాళ్లు సైతం కోహ్లీ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. తీరా కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాకా.. రిటైర్మెంట్ ఇవ్వమంటూ ఉచిత సలహాలు ఇస్తూ.. అక్కసును వెళ్లగక్కుతున్నారు. ఇప్పటికే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిదీ.. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే మంచి సమయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పాక్ మాజీ క్రికెటర్, రావాల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాలని సూచించాడు.
ఇలా ఎప్పుడూ ఏదో ఒక విషయంపై అసందర్భంగా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలవడం పాక్ ఆటగాళ్లకు అలవాటే అయినా.. విరాట్ కోహ్లీ ఫామ్‌లో లేడని ఇన్నాళ్లు బాధపడుతున్న ఇండియన్స్ ఫ్యాన్స్ కోహ్లీ తిరిగి ఫామ్ అందుకున్నాడని సంతోష పడుతున్న టైమ్‌లో పాక్ ఆటగాళ్ల రిటైర్మెంట్ కామెంట్లు కోపం తెప్పిస్తున్నాయి. కోహ్లీ ఇప్పుడే శుభమా అని ఫామ్‌లోకి వస్తే ఏంటి వీళ్ల గోల అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లో లేదని, అతను తన ఫామ్‌ను అందుకుంటే చూడాలని ఉందని ముసలి కన్నీరు కార్చిన పాక్ ఆటగాళ్ల.. కోహ్లీ కింగులా ఫామ్‌లోకి రావాడంతోనే రిటైర్మెంట్ పాఠం అందుకున్నారు.
అసలు కోహ్లీ రిటైర్మెంట్‌పై వీళ్లకు ఎందుకంత ఇంట్రస్టో చాలా మందికి అర్థం కాని విషయం. ఆసియా కప్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించి.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలుపుతాడని పాక్ ఆటగాళ్లు భయపడుతున్నారంటూ కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయి ఆడే కోహ్లీ.. భీకర ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో వారికి తెలుసని.. అందుకే కోహ్లీపై రిటైర్మెంట్ ప్రెషర్ పెట్టేందుకే ఇలా అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి కోహ్లీ రిటైర్మెంట్‌పై అఫ్రిదీ, అక్తర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: బాబర్ అజమ్, రిజ్వాన్ మెగా టోర్నీలు గెలిపించలేరు! ఎందుకంటే..: పాక్ పేసర్
Shoaib Akhtar suggests Virat Kohli should consider retirement from T20Is 🤯🤯
What are your views on this? 👇🏻#viratkohli #indiancricket #indiavpakistan #cricketpakistan pic.twitter.com/SSszfchNCE
— Sportskeeda (@Sportskeeda) September 15, 2022