వారిద్దరూ టీ20 ర్యాంకింగ్స్ లో టాప్-2లో ఉన్నారు. వారి ఆటకి అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరు.. ఈ మధ్య ఆసియాకప్ లో రాణించగా, మరొకరు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. దీంతో వాళ్ల గురించి చర్చ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ దేశ మాజీ క్రికెటరే.. సదరు ఆటగాళ్లపై భారీ విమర్శలు చేశాడు. మెగాటోర్నీల్లో తమ జట్టుని వారిద్దరూ గెలిపించలేరని చెబుతూ.. గాలి మొత్తం తీసేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ జట్టు ఓపెనర్లు రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజామ్ వల్ల పెద్ద పెద్ద టోర్నీల్లో పాక్ గెలవలేదని ఆ జట్టు మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ అన్నాడు.
టోర్నీలు గెలిపించే సహకారం బాబర్-రిజ్వాన్ అందించట్లేదని ఆకిబ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్నా సరే వారి ఆట మాత్రం సరికాదని పేర్కొన్నాడు. వాళ్లిద్దరి బ్యాటింగ్, జట్టుని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని చెప్పాడు. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటమే దీనికి కారణమని తెలిపాడు. ఆసియాకప్ లో వాళ్లిద్దరి బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశాడు. పెద్ద టోర్నీల్లో వాళ్లు నిదానంగా బ్యాటింగ్ చేస్తుండటం వల్ల మిగతా బ్యాటర్లపై ఒత్తిడి ఎక్కువైపోతుందని అన్నాడు.
‘ఈ ఓపెనర్స్(బాబర్, రిజ్వాన్) వల్ల పాక్ జట్టు టోర్నీల్లో గెలవలేదు. ప్రపంచంలోనే టాప్-2 బ్యాటర్లు వీళ్లు కావొచ్చు కానీ ఎలాంటి ఆట ఆడాలో తెలుసుకోవాలి. సాధించాల్సిన రన్ రేట్ 8 ఉన్నప్పుడు.. నిదానంగా ఆడతాడు. 15-17 ఓవర్లలో కొడదామని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడు ఔటైపోతాడు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఆసియాకప్ ఫైనల్లో ఇదే జరిగింది. అందుకే శ్రీలంక చేతిలో ఓడిపోయింది’ అని ఆకిబ్ చెప్పాడు. ఇక ఆసియాకప్ లో రిజ్వాన్ 226 పరుగులు చేయగా, బాబర్ 63 పరుగులు మాత్రమే చేశాడు. మరి పాక్ ఓపెనర్లపై ఆ దేశ మాజీ బౌలర్ సీరియస్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి:కోహ్లీ రికార్డు బ్రేక్ చేయడంపై బాబర్ అజామ్ ఓవరాక్షన్!