టీ20 వరల్డ్ కప్ జట్టులో సంజూ శాంసన్‌కు చోటు ఇవ్వలేదని ఒకవైపు అతని అభిమానులు తిరువనంతపురంలో నిరసన తెలుపుతుంటే.. మరోవైపు న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న వన్డేలో సంజు శాంసన్ దుమ్మురేపుతున్నాడు. జట్టులో చోటు దక్కలేదనే కసితో ఆడుతున్నాడో ఏమో కానీ.. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అతనితో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, టీమిండియా క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఏ, ఇండియా-ఏ జట్ల మధ్య మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి(18) త్వరగానే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 8 ఫోర్లతో 39 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రాహుల్ అవుట్ తర్వాత వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ సంజు వికెట్లు కాపాడుకుంటూ కొంత నిదానంగానే ఆడినా కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలోనే 68 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 54 పరుగులు చేసి 36వ ఓవర్‌లో జాకబ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. 62 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఇక చివర్లో స్టార్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ బ్యాట్ ఝుళిపించాడు. 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో వీరవిహారం చేసి 51 పరుగులతో కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. దీంతో టీమిండియా 49.3 ఓవర్లలో 284 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సంజు శాంసన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 15 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసి.. కష్టాల్లో ఉంది. టీమిండియా బౌలర్ రాహుల్ ఇప్పటి వరకు మూడు ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మరి ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ ప్రదర్శన చూసి అయినా టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకుంటారో లేదో చూడాలి. వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపికైన దీపక్ హుడా వెన్ను గాయంతో బాధ పడుతుండగా అతని స్థానంలో శాంసన్‌ను తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.
Sanju Samson fifty
54
Sanju Samson showing his consistency throughout the seriesCaptain Leading from front
Well played Sanju #SanjuSamson pic.twitter.com/NOS8yT2W08— Mahi Bishnoi (SanjusamsonFan) (@Sanjusamsonf11) September 27, 2022
Sanju Samson in the One Day series vs New Zealand A: 29*(32), 37(35) & 54(68) – he is currently the leading run scorer in this series.
— Johns. (@CricCrazyJohns) September 27, 2022