క్రీడా ప్రపంచంలో ప్రత్యర్దిని తన వ్యూహ ప్రతివ్యూహాలతోనే బోల్తా కొట్టించాలి. అప్పుడే మనం మన శత్రువుపై విజయం సాధించగలం. ఈ వ్యూహాలను అమలు జరిపేది ఆ జట్టు సారథి మాత్రమే. టీమ్ కెప్టెన్ ఎంత గొప్పగా ఆలోచించగలిగితే.. అంత గొప్ప విజయాలు ఆ జట్టు సొంతం అవుతాయి. అయితే కొన్ని కొన్ని ఒత్తిడి సందర్భాల్లో కెప్టెన్ సహనం కోల్పొయి.. నోటికి పని చేప్పిన సంఘటనలూ మనకు కనిపిస్తాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన నోటికి పనిచెప్పాడు. గ్రౌండ్ లోనే బూతులు తిడుతూ కెమెరా కంటికి చిక్కాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అది ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న టైమ్. క్రీజులో మ్యాక్స్ వెల్ ఉన్నాడు. బౌలింగ్ చేయడానికి ఉమేశ్ యాదవ్ వచ్చాడు. అప్పటికి ఆసిస్ స్కోర్ 123/3 తో ఉంది. 11వ ఓవర్ 5వ బంతిని ఉమేశ్ విసరగా మ్యాక్స్ వెల్ బ్యాట్ కు తాకుతూ.. కీపర్ డీకే చేతుల్లో బాల్ పడింది. అందరూ అవుట్ అని అప్పీల్ చేశారు.. కానీ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. దాంతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బ్యాట్ కు బాల్ తాకినట్లు తేలింది. దీంతో మ్యాక్స్ వెల్ పెవిలియన్ దారి పట్టాడు. ఈ సమయంలోనే రోహిత్ శర్మ దినేశ్ కార్తీక్ పై నోరు పారేసుకున్నాడు. కోపంగా ఏవో బూతులు తిడుతూ కనిపించాడు. తర్వాత అతడి గొంతును సైతం పట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు బూతులు తిడుతున్న వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
ఇక ఈ వీడియోని చూసిన కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. “వామ్మో రోహిత్ నీకు ఇన్ని బూతులు వచ్చా” అంటే.. మరో నెటిజన్ నీకన్నా ధోనినే నయ్యం” అంటూ రాసుకొచ్చాడు. ఎంత సహనం కోల్పోతే మాత్రం అంతలా తిట్టాలా? అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అయితే ధోని మాత్రం ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఇతర ఆటగాళ్ల మీద ఎప్పుడూ కోపం వ్యక్తం చేయలేదు. అతడు మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనందరికి తెలిసిందే. రోహిత్ మాత్రం అలా కాదు.. బ్యాట్ కు బంతి తగిలినా కానీ ఎందుకు గట్టిగా అరవలేదు అంటూ.. డీకే పై కోపం వ్యక్తం చేస్తూ.. అతడిని తిట్టాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) September 21, 2022