ఆసియాకప్ ఈ మధ్య జరిగింది. గ్రూప్ దశలో పాకిస్థాన్ ని ఓడించిన టీమిండియా.. సూపర్ 4లోనూ అదే జట్టుతో మ్యాచ్ ఆడింది. 181 పరుగుల భారీ స్కోరు చేసింది. అయినా పాక్ దే విజయం. ఆ తర్వాత మ్యాచులో 174 లక్ష్యాన్ని శ్రీలంక జట్టుకు నిర్దేశించింది. సేమ్ సీన్ రిపీట్. మళ్లీ భారత్ ఓడిపోయింది. తాజాగా ఆసీస్ తో తొలి టీ20 విషయానికొస్తే.. ఏకంగా భారత్ 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఆ టార్గెట్ ని చాలా సులభంగా బాదేసింది. దీంతో రోహిత్ సేనకు మరో ఓటమి తప్పలేదు. ఈ మూడు సందర్భాల్లోనూ టీమిండియా ఓడిపోవడానికి ఒక్కటే కారణం. అదే బౌలింగ్ వైఫల్యం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా ప్రస్తావన రాగానే కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ ఇలా స్టార్ క్రికెటర్స్ చాలామంది గుర్తొస్తారు. దీనికి తోడు గత టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. అన్ని ఫార్మాట్లలోనూ మన జట్టు దుమ్మురేపింది. కొంతకాలంగా మాత్రం లయ తప్పింది. కీలక పేసర్ బుమ్రా గాయాలపాలవడం, షమిని టీ20లకు ఎంపిక చేయకపోవడం, భువనేశ్వర్ ఫామ్ తప్పడం.. జట్టు ఓటమికి ఇలా కారణాలెన్నో. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసే భువీ కూడా ఎడాపెడా పరుగులు సమర్పిస్తున్నాడు. గత నాలుగు మ్యాచుల విషయాన్నే తీసుకుంటే 4 ఓవర్లు వేసి 63 పరుగులు ఇచ్చేశాడు. ఈ గణాంకాలు చూస్తేనే సీన్ అర్ధమైపోతుంది అనుకుంటా..!
భువీకి తోడు హర్షల్ పటేల్ ఇంకా కుదురుకోలేదు. షమిని అయితే టీ20లకే పనికిరాడనే కారణం చెబుతూ అసలు ఎంపిక చేయట్లేదు. మిగతా బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో బుమ్రా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బుమ్రా లేకపోతే మ్యాచులు గెలవలేమా అని డిస్కస్ చేస్తున్నారు. ఆసీస్ తో తొలి20లో ఓడిపోయిన తర్వాత మాట్లాడిన హార్దిక్ పాండ్.. బుమ్రా లేకపోవడం జట్టుకి భారీ లోటే అని అన్నాడు. రోహిత్ శర్మ కూడా మాట్లాడుతూ, గాయం ఇంకా తగ్గకపోవడం వల్లే బుమ్రా ఈ మ్యాచులో అందుబాటులో లేడని చెప్పాడు.
Indian best bowler Boom Boom Bumrah💥💥#Bumrah pic.twitter.com/WsogN87jaI
— 𝕬𝖇𝖍𝖎𝖏𝖊𝖊𝖙 𝕽𝖆𝖚𝖙𝖍𝖆𝖓 💫🇮🇳 (@AbhijeetR27) September 21, 2022
మరోవైపు ఆసియాకప్ ప్రారంభమయ్యే సమయానికి బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి కనీసం రెండు నెలలైనా పట్టొచ్చని వైద్యులు తేల్చారు. బీసీసీఐ మాత్రం ఆసీస్, దక్షిణాఫ్రికా సిరీసులకు అతడిని ఎంపిక చేసింది. సెలెక్ట్ చేసింది సరే మ్యాచులు ఆడించలేక ఇప్పుడు అభాసుపాలవుతోంది. ప్రస్తుతం మన బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. టీ20 ప్రపంచకప్ మొదలయ్యే లోపు బౌలింగ్ విభాగాన్ని పటిష్ఠం చేసుకోకపోతే మాత్రం మనం కప్ కాదుకదా కనీసం లీగ్ దశ దాటడం కూడా కష్టమే! మరి బుమ్రా గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Can’t thank these men enough for their hardwork, expertise and all the hours they’ve put in to help me get back to the game 🏏 pic.twitter.com/kq3kSTleWE
— Jasprit Bumrah (@Jaspritbumrah93) September 17, 2022
Jasprit Bumrah’s record is unbelievable in T20Is since 2019 – Waiting for your comeback King. pic.twitter.com/sW8pPqQU83
— CricketMAN2 (@ImTanujSingh) September 21, 2022
ఇదీ చదవండి: తీరుమారని టీమిండియా.. మళ్లీ ఆ తప్పులే కొంపముంచాయి..