డీకే జట్టులోకి తిరగి రాకముందు ధోని తర్వాత ధోని అంతటోడు అయ్యేలా కనిపించిన రిషభ్ పంత్.. కొన్ని రోజులుగా సోదిలో కూడా లేకుండా పోయాడు. అసలు జట్టులో స్థానం దక్కడమే కష్టంగా మారింది. డీకే టీమిండియాలో ఫినిషర్‌గా ఉంటున్నా.. అతని కీపింగ్ టాలెంట్‌తో రిషభ్ పంత్‌కు పక్కలో బళ్లెంలా తయారైయ్యాడు. టీమిండియా నిఖార్సయిన ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలంటే ఒక బ్యాటర్‌ను తప్పించాలి.. ఇలా పరిస్థితే వస్తే తుది జట్టులో చోటు కోల్పోయే ఫస్ట్ పర్సన్ రిషభ్ పంత్. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా టాపార్డర్ భీకర ఫామ్‌లో ఉంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ నలుగురు కూడా ఫామ్‌లో ఉన్నారు. ఏ ఇద్దరి నిలబడినా.. మిగతా వారికి బ్యాటింగ్ కష్టమే. చివర్లో ఎవరైనా అవుట్ అయితే కోచ్ ద్రవిడ్ డీకేను దింపేస్తున్నాడు.
దీంతో పంత్ జట్టులో ఉన్న బ్యాటింగ్ రావడంలేదు. ఇక కేవలం కీపింగ్ కోసం అతన్ని జట్టులోకి తీసుకునే బదులు మరో బౌలర్‌ను జట్టులోకి తీసుకుంటే బెటర్ అనే ఆలోచన, పిచ్ పరిస్థితులను బట్టి టీమ్ మేనేజ్‌మెంట్ వచ్చిందా.. పంత్ ప్లేస్ గోవిందా. ఇంత క్లిష్టపరిస్థితుల్లో ఆడుతున్న పంత్ ఎంత జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన చిన్న ఛాన్స్‌నైనా ఒడిసిపట్టుకోవాలి. కానీ.. మనోడు మాత్రం అంత కసితో కనిపించడంలేదు. పైగా వికెట్ కీపింగ్‌లో బంతులను వదిలేస్తూ.. పక్కనే ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం తెప్పిస్తున్నాడు. ఇలాంటి కీపింగ్‌తో జట్టులో కొనసాగడం కష్టమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో కూడా ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని అందుకోవడంతో విఫలం అయ్యాడు. పుడ్డు మీద కారం చల్లినట్లు మిస్ అయిన ఆ బంతి వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకు పొత్తి కడుపుపై తగిలింది. ఇంకొంచెం కింద తగిలి ఉంటే రోహిత్ గాయపడేవాడు. అదృష్టం కొద్ది అలాంటిదేమి జరగలేదు. కానీ.. పంత్ కీపింగ్ సామర్థ్యానికి ఆ బంతిని అందుకుని ఉండాల్సింది. కానీ.. పంత్ అలా చేయలేకపోయాడు. దినేష్ కార్తీక్‌తో ఉన్న పోటీ నేపథ్యంలో పంత్ ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు చేస్తూ.. జట్టులో తన చోటను మరింత సంక్లిష్టం చేసుకుంటున్నాడు.
This is why dk preferred over pant 😭😭😭😭 pic.twitter.com/gwd1yK4Xur
— Prasun jha (@prasunj89) October 2, 2022
ఇది కూడా చదవండి: టీమిండియాతో మ్యాచ్ తర్వాత మిల్లర్‌ను క్షమాపణ కోరిన క్వింటన్ డికాక్!