భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొత్తం కలిపి 40 ఓవర్ల ఈ మ్యాచ్‌లో ఏకంగా 458 పరుగులు నమోదు అయ్యాయి. ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 16 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(57), రోహిత్ శర్మ(43) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(61), విరాట్ కోహ్లీ(49 నాటౌట్) చెలరేగడంతో టీమిండియా 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా ఆరంభంలో తడబడినా.. డేవిడ్ మిల్లర్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సులతో 106 పరుగుల చేసి దుమ్మురేపడంతో విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఓడింది.
అతనికి తోడు ఓపెనర్ క్వింటన్ డికాక్ కూడా 68 పరుగులతో రాణించినా.. కాస్త నెమ్మదిగా ఆడాడు. చివర్లో స్పీడ్ పెంచినా అప్పటికే కావాల్సిన రన్‌రేట్ కొండెక్కింది. మిల్లర్-డికాక్ కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ సౌతాఫ్రికా విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. మ్యాచ్ ఓడినా.. మిల్లర్ చూపించిన పోరాట పటిమ క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. చివరికి డికాక్ కూడా మ్యాచ్ ముగిసిన తర్వాత మిల్లర్‌ను ప్రశంచి, క్షమాపణలు కూడా కోరాడు. తన స్లో బ్యాటింగ్‌తోనే మ్యాచ్ ఓడిపోయాం అంటూ సారీ చెప్పినట్లు మిల్లరే స్వగంగా ప్రకటించాడు.
మిల్లర్ మాట్లాడుతూ.. ‘క్వింటన్ డికాక్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ తన బ్యాటింగ్‌తో మాకు విజయవకాశాలు కల్పించాడు. ఫోర్లు, సిక్స్‌లను సింపుల్‌గా కొట్టగల సామర్థ్యం డికాక్‌కు ఉంది. కానీ స్టార్టింగ్‌తో సెట్ అవ్వడానికి కొంత సమయం తీసుకున్నాడు. అందుకే మ్యాచ్ తర్వాత నా దగ్గరికి వచ్చిన క్షమాపణలు చెప్పాడు. ‘బాగా ఆడావు. నావల్లే విజయం సాధించలేకపోయాం. సారీ’ అంటూ డికాక్ చెప్పిన విషయాన్ని వివరించాడు. కాగా.. కొంత కాలంగా డికాక్ సరైన ఫామ్‌లో లేడు. ఈ మ్యాచ్ ఓడినా డికాక్ ఫామ్ అందుకోవడంపై సౌతాఫ్రికా టీమ్ సంతోషంగా ఉంది. ఇక డికాక్ మ్యాచ్ ఫలితంపై తన స్లోబ్యాటింగ్ ప్రభావం చూపిందని, మిల్లర్ పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని అతనికి సారీ చెప్పినట్లు తెలుస్తుంది. కాగా.. టీ20 వరల్డ్ కప్‌కు ముందు డికాక్ ఫామ్‌లోకి రావడం సౌతాఫ్రికాకు కలిసొచ్చే అంశం.
India win the 2nd T20I by 16 runs, but what a knock from David Miller 🤯
An outstanding century 💯#INDvSA pic.twitter.com/MC31oWGQPg
— Wisden (@WisdenCricket) October 2, 2022
ఇది కూడా చదవండి: వీడియో: నిస్వార్థానికి నిలువెత్తు రూపం కోహ్లీ! విరాట్ త్యాగానికి న్యాయం చేసిన DK