సౌతాఫ్రికాతో జరిగిన 2వ టీ20లో టీమిండియా దుమ్మురేపింది. దాంతో 16 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి 3 టీ20ల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడగా.. మరో సారి సూర్యకుమార్ తన మాస్ ఇన్నింగ్స్ ను రుచి చూపించాడు. అయితే మ్యాచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం కింగ్ కోహ్లీ అనే చెప్పాలి. ఎందుకంటే అర్దశతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్నాగానీ.. తన స్వార్థం తాను చూసుకోకుండా జట్టు ప్రయోజనాలే తనకు ముఖ్యం అని మరోమారు నిరూపించాడు కోహ్లీ. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ-దినేశ్ కార్తీక్ ల మధ్య జరిగిన సంఘటన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విరాట్ కోహ్లీ కి రికార్డులు కొత్తేమి కాదు. క్రీజ్ లోకి వచ్చాడంటే చాలు.. రికార్డులు సలామ్ అంటూ.. గులామ్ కొడతాయి. ఇక కోహ్లీ ఎప్పుడూ రికార్డుల గురించి పట్టించుకోలేదు. అయితే సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో జరిగేది ఏంటంటే? ఎవరైనా బ్యాట్స్ మెన్ సెంచరీకి, హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉండి.. చివరి ఓవర్ అయితే మరో బ్యాటర్ అతడికి అవకాశం ఇవ్వాలనుకోవడం సహజమే! తాజాగా సౌతాఫ్రికాతో 2వ టీ20లో కూడా దినేశ్ కార్తీక్.. కోహ్లీకి ఇదే ఆఫర్ ఇచ్చాడు. కానీ కోహ్లీ దాన్ని సున్నితంగా తిరస్కరించి.. తన రికార్డుల కంటే జట్టు విజయానికే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. అసలేం జరిగింది అంటే? భారత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్.. అప్పటికే కోహ్లీ 49 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. మరో వైపు బ్యాటింగ్ స్ట్రైక్ లో DK ఉన్నాడు. లాస్ట్ ఓవర్ వేయడానికి రబాడ వచ్చాడు. తొలి బంతి అద్భుతంగా వేయడంతో పరుగులేమి రాలేదు. 2వ బంతిని కార్తీక్ బౌండరీకి తరలించాడు. 3, 4(వైడ్) బాల్స్ ను కూడా డీకే సరిగా ఆడలేదు. ఆ తర్వాత బంతిని డీకే సిక్స్ గా మలిచాడు.
అనంతరం కోహ్లీ దగ్గరకు వెళ్లి రెండు బంతులే ఉన్నాయి.. నేను సింగిల్ తీసి ఇస్తా.. నువ్వు ఫిఫ్టీ ఫినిష్ చేయి అన్నాడు. దాంతో కోహ్లీ నాకు సింగిల్ అక్కర్లేదు నువ్వు ఫినిష్ చేయి అంటూ.. చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. ఇక ఆ బంతిని కూడా డీకే సిక్స్ గా మలిచాడు. దీంతో చివరి ఓవర్లో 2 సిక్స్ లు, ఫోర్ తో మెుత్తం 18 పరుగులు వచ్చాయి. కోహ్లీ 49 పరుగులతో నాటౌట్ గా నిలవగా.. ఫినిషర్ డీకే 7 బంతుల్లో 17 రన్స్ చేసి మరో సారి తాను బిగ్ ఫినిషరే అని నిరూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్స్ కింగ్ కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ”నీ నిస్వార్థాన్ని బయటపెట్టావ్.. ఇదీ అసలైనా ఆటగాడి లక్షణం కోహ్లీ భాయ్” “నీకు రికార్డులు ఒక లెక్కా.. అవి నీ వెనకాలే పరిగెత్తుకు వస్తాయి.. ఇలాగే ఆడు కింగ్ కోహ్లీ” 50లు.. 100లు వస్తాయి పోతాయి.. కానీ దేశం గెలవాలని చూశావు అది గ్రేట్ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
The special moment when Virat Kohli told Dinesh Karthik to just continue the hitting. What a player! pic.twitter.com/nGxDiFH9SY
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 2, 2022
virat kohli telling to dinesh karthik to comple what humble person 🙏 pic.twitter.com/25Vzh5ybu1
— cricket lover (@cricket65469710) October 2, 2022
Virat Kohli at 49* telling DK to keep the strike pic.twitter.com/8LquJPIADi
— Sagar (@sagarcasm) October 2, 2022