ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మరో 4 నాలుగు రోజుల్లో మాజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఆ స్థానంలో 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బాధ్యతలు తీసుకోనున్నాడు. గంగూలీ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికి బోర్డు మాత్రం దాదాను కాదని బిన్నీకే అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ మేరకు రోజర్ బిన్నీ నామినేషన్ కూడా దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. తదుపరి బీసీసీఐ బాస్‌గా తన స్నేహితుడైన బిన్నీ బాధ్యతలు చేపట్టనుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. అంతటితో ఊరుకొని రవిశాస్త్రి పరోక్షంగా గంగూలీపై సెటైర్లు వేశాడు.
గత కొన్నేళ్లుగా గంగూలీతో రవిశాస్త్రికి సత్సంబంధాలు లేవు. ఇది బహిరంగ రహస్యం. గంగూలీ హయాంలోనే రవిశాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో దాదా బీసీసీఐ నుంచి తప్పుకుంటుంటే.. కోహ్లీ అభిమానులు ఎంతలా సంతోషపడుతున్నారో.. రవిశాస్త్రి అంతకుమించి అనందంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన శాస్త్రి.. “రోజర్ బిన్నీ పేరు తెరపైకి రావడం సంతోషంగా ఉంది. నా మిత్రుడు ఈ పదవికి అన్ని విధాలా అర్హుడు. వరల్డ్ కప్‌లో నా సహచరుడు కూడాను. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేష్ అధ్యక్షుడిగా పని చేసిన బిన్నీ.. త్వరలో బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నాడు.. ఇది ఆనందించదగ్గ సమయం..” అని వ్యాఖ్యానించాడు.
అలాగే గంగూలీపై పరోక్షంగా.. “మీడియాలో నేను చదివిన దాన్ని బట్టి బీసీసీఐ అధ్యక్ష పదవి రెండోసారి ఎవరూ చేపట్టలేదు. ఇది మరో క్రికెటర్‌కు అవకాశాన్ని ఇస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. చాలా కాలంపాటు కొన్ని పనులు మాత్రమే చేయగలం తర్వాత ముందుకు సాగాల్సిందే” అని గంగూలీపై పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా, 67 ఏళ్ల రోజర్ బిన్నీకి అడ్మినిస్ట్రేటర్‌గా అనుభవం ఉంది. కేఎస్‌సీఏలో బ్రిజేష్ పటేల్, అనిల్ కుంబ్లేలతో కలిసి పని చేశాడు. 2019లో తిరిగి కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అక్టోబర్ 18న ముంబైలో జరగనున్న ఏజీఎం మీటింగ్ అనంతరం బిన్నీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
“I am extremely happy because it’s a World Cup winner who is the president for the first time in the history of the BCCI.”
Ravi Shastri believes Roger Binny has got all boxes ticked to become BCCI president. https://t.co/XJ7IYK0Xl6
— Sportstar (@sportstarweb) October 12, 2022