టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఒక వైపు గాయాలు టీమిండియాను కలవరపెడుతున్నా.. మరోవైపు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాడు. భారత జట్టుకు ప్రధాన బలంగా ఉన్న టాపార్డర్ బలహీనతను దూరం చేసేందుకు అద్భుతమైన ప్లాన్ వేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఎంతటి అద్భుతమైన బ్యాటర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిలబడితే ఎలాంటి జట్టునైనా ఒంటిచేత్తో ఓడించగలరు. కానీ.. వీరి ముగ్గురికి ఉన్న కామన్ వీక్నెస్.. లెఫ్టార్మ్ బౌలింగ్. ఎడమచేతి వాటం బౌలర్‌ను ఎదుర్కొవడంలో ముగ్గురు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ వీక్నెస్ ఆస్ట్రేలియా లాంటి పిచ్‌లపై మరింత ఎక్కువగా ఉంటుంది.
ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్, రాహుల్ ప్రదర్శనపైనే టీమిండియా విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఈ విషయాన్ని గమనించిన రాహుల్ ద్రవిడ్ ఒక ప్రత్యేక ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ప్లాన్‌లో భాగంగానే చేతన్ సకారియాతో పాటు ముకేష్ కుమార్‌లను సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశాడు. ఈ సిరీస్ తర్వాత వీరిద్దరినీ టీ20 వరల్డ్ కప్ కోసం నెట్ బౌలర్లుగా కూడా వెంట తీసుకెళ్లనున్నారు. నెట్స్‌లో భారత బ్యాటర్లకు వీరి చేత బౌలింగ్ చేయించి వారి బలహీనతను పోగెట్టేందుకు ద్రవిడ్ ప్రయత్నం మొదలుపెట్టినట్లు సమాచారం. కాగా.. ద్రవిడ్ ప్లాన్ ప్రకారం.. సకారియా, ముకేష్ బౌలింగ్‌లలో కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ సెట్ అయితే.. 23న పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు స్టార్ బౌలర్ లెఫ్టార్మ్ పేసర్ అయిన షాహీన్ అఫ్రిదీకి చుక్కలు చూపించడం ఖాయం.
ఇక ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి చేతన్ సకారియా మంచి ప్రదర్శన కనబర్చాడు. ముకేష్ కుమార్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం ఇరానీ ట్రోఫీ 2022లో సౌరాష్ట్ర తరుఫున ఆడిన ఛేతన్ సకారియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. ముకేశ్ కుమార్ ఇరానీ ట్రోఫీలోనే రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తరుఫున తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ ఇద్దరికి ద్రవిడ్ ప్లాన్‌లో భాగంగానే టీమిండియాలో చోటు దక్కినట్లు సమాచారం. ఇక ఇప్పటికే అర్షదీప్ రూపంలో ఒక లెఫ్టార్మ్ పేసర్ ఉన్నా.. ఒక్కడిపైనే భారం వేయడం సాధ్యం కాదు. గతంలో జహీర్‌ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ రూపంలో టీమిండియాకు నిఖార్సయిన లెఫ్టార్మ్ పేసర్లు ఉండేవారు. వారి రిటైర్మెంట్ తర్వాత జట్టులో లెఫ్టార్మ్ పేసర్ల లోటు స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు అర్షదీప్ వారి స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్నా.. డెత్ ఓవర్స్‌లో తేలిపోతున్నాడు.
#MukeshChoudhary, #ChetanSakariya to travel with Indian squad for #T20WorldCup2022 in #Australiahttps://t.co/cTwIsrT5ib
— DNA (@dna) October 3, 2022
Shaheen afridi vs India T20 world cup 2021 🔥♥️ pic.twitter.com/QCnOjnEPyI
— Malik Khalid Awan (@MalikKhalid_01) August 29, 2022
ఇది కూడా చదవండి: ఫ్లైట్ ఎక్కలేదని.. ఏకంగా టీ20 వరల్డ్ కప్ టీమ్ నుంచే తప్పించారు!