క్రికెట్ అభిమానులకు వినోదం.. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు కలలు కంటారు. రీచ్ క్యాష్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను చూసి చాలా దేశాల్లో అలాంటి లీగ్‌లు పుట్టుకొచ్చాయి.ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఇలాంటి ఓ లీగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి-20 లీగ్ లో ఉన్న జట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జోహన్నెస్‌బర్గ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఈక్రమంలో సీఎస్‌కే నుంచి ఇంకో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. సీఎస్‌కే జట్టు తరపున ఎంఎస్ ధోని సౌతాఫ్రికా టీ-20లీగ్‌లో ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సౌతాఫ్రికా టీ-20 లీగ్ మొదటి సీజన్ ప్రారంభించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు కసరత్తలు చేస్తోంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్టు ఉన్నాయి. వీటిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. కేప్‌టౌన్‌ను ముంబై ఇండియన్స్, జోహన్నెస్‌బర్గ్ జట్టును చెన్నై సూపర్ కింగ్స్, డర్బన్ టీమ్ ను లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజిబెత్ జట్టును SRH, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్, పార్ల్ ను రాజస్తాన్ రాయల్స్ దక్కించకున్నాయి. ఈక్రమంలో ఈ లీగ్ సంబంధించి ఓ వార్త వినిపిస్తోంది. ధోని ఈ లీగ్ లో ఆడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీఎస్కే తో ధోనికి ఉన్న అనుబంధం దృష్ట్య సౌతాఫ్రికా లీగ్ లో ఆడనున్నట్లు తెలిస్తుంది.
ఇది నిజమైతే మాత్రం సీఎస్‌కే కొనుగోలు చేసిన జోహన్నెస్‌బర్గ్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఐపీఎల్‌లో ధోని ఎంత సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కేలో కొనసాగిన ధోని.. ఆ జట్టును నాలుగుసార్లు విజేతగాను మరో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిపాడు. సౌతాఫ్రికా టీ-20లీగ్ లో ధోని ఆడనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేంద్రుడి విశ్వరూపం మరోసారి చూడొచ్చని ఆశపడుతున్నారు. మరి.. ఈ ప్రొటీస్ లీగ్ లో ధోని ఆడనున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.